AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కుమారుడికి క్యాస్ట్ లెస్ సర్టిఫికెట్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై ప్రశంసల జల్లు

బర్త్‌ సర్టిఫికేట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని సూచనలు, సలహాలు జారీ చస్తున్నాయి . అయితే దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోయిన్ మాత్రం దీనిని ఆచరించింది.

Tollywood: కుమారుడికి క్యాస్ట్ లెస్ సర్టిఫికెట్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై ప్రశంసల జల్లు
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 17, 2025 | 7:53 PM

Share

కొన్ని రోజుల క్రితం 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మస్సె తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందిన అతను తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ లో (రిలీజియన్) కాలమ్ ను ఖాళీగా వదిలేశాననన్నాడు. ప్రభుత్వం కూడా మత ప్రస్తావన లేకుండానే తన కుమారుడికి బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిందన్నాడు. దీంతో నెటిజన్లు ఈ యంగ్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే విక్రాంత్ కంటే ముందు టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ కూడా ఇదే పని చేసి అందరి మన్ననలు అందుకుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో తమిళుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే తన మనసుకు నచ్చిన వాడిని మనువాడిందీ అందాల తార. పెళ్లైన మరుసటి ఏడాదే ఈ నటికి ఒక పండంటి మగ బిడ్డ పుట్టాడు. అయితే ఆ మధ్యన ఓ సందర్భంలో తన కుమారుడి గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తన కుమారుడికి క్యాస్ట్ లెస్ సర్టిఫికెట్ చేయించానని పేర్కొంది. దీంతో ఈ హీరోయిన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఇటీవలే భైరవం సినిమాలో కనిపించిన వరంగల్ హీరోయిన్ ఆనంది.

సినిమాల్లో బిజీగా ఉండగానే సోక్రటిస్ అనే కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది ఆనంది. 2021 వరంగల్ లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాతి సంవత్సరం ఈ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడికి క్యాస్ట్ లెస్ సర్టిఫికెట్ చేయించానని తెలిపింది. తాను చదివిన పుస్తకాలే తనలో మార్పుకు కారణమయ్యాయని ఆనంది పేర్కొంది. తన నిర్ణయాన్ని తన భర్త కూడా సమర్థించాడని ఆనంది తెలిపింది.

ఇవి కూడా చదవండి

సినిమాల్లో బిజీగ ఉండగానే ప్రేమ వివాహం

కాగా ఆనంది ఇటీవలే భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆనందితో పాటు అదితీ శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో (శుక్రవారం జులై 17) ఓటీటీలోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.