Anushka Shetty Birthday: అందాల భామ అనుష్క బర్త్ డే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది. ఆతర్వాత 2006లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ భామ.

Anushka Shetty Birthday: అందాల భామ అనుష్క బర్త్ డే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్
Anushka
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2024 | 9:27 AM

ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అనుష్క. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. మంగుళూరులో పుట్టిన అనుష్క.. బెంగుళూరులో స్టడీ పూర్తి చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ యోగా ట్రైనర్ గా పని చేసింది. ఇక ఈ అమ్మడిని కింగ్ నాగార్జున ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది. ఆతర్వాత 2006లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు.

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఆతర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా అనుష్క కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత అనుష్క క్రేజ్ మరింత పెరిగింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించింది ఈ చిన్నది. ఇక రాజమౌళి దర్శత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లిగురించి నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

ప్రస్తుతం అనుష్క వయసు 43 ఏళ్ళు.. ఇప్పటికీ ఈ చిన్నది పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఓ స్టార్ హీరోతో అనుష్క పెళ్లి అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ దీని పై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. అనుష్క శెట్టి ప్రస్తుతం ఒక తెలుగు అలాగే ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది.  దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘ఘటి’ అనే సినిమా చేస్తోంది అనుష్క. నేడు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అనుష్క అభిమానులు ఈ అమ్మడి ఫోటోలు, సినిమా సీన్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!