AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ఆమె.? మెగాస్టార్ చిరంజీవి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కురాళ్లను తన అందంతో కవ్వించింది.

Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2024 | 12:27 PM

Share

సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మచారులుగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెళ్లితో పనేంటి అని అంటుంటే మరికొంతమంది మాత్రం పెళ్ళికి ఇంకా టైం ఉంది అని తప్పించుకుంటున్నారు. మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకొని హీరోయిన్ కొంతమంది ఉంటే మరికొంతమంది నాలుగు పదుల వయసు వచ్చినా అలానే ఉన్నారు. అలాంటి వారిలో ఓ భామ ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా 49 ఏళ్ల వయసులో ఆమె పెళ్ళికి రెడీ అయ్యిందని అంటున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. అంతే కాదు కెరీర్ పీక్ లో ఉండగా ముగ్గురు స్టార్ హీరోలతో అలాగే ఓ క్రికెటర్ తో ఎఫైర్ ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ఆమె.? మెగాస్టార్ చిరంజీవి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కురాళ్లను తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నగ్మా. 1991లో పెద్దింటల్లుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నగ్మా. ఆతర్వాత నాగార్జున హీరోగా నటించిన కిల్లర్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది నగ్మా.. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అప్పట్లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ భాషలు ఏలింది. అదే సమయంలో నగ్మా లవ్ ఎఫైర్స్‌ వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. నగ్మా లవ్ ఎఫైర్స్ గురించి అప్పటిలో తెగ వార్తలు వచ్చాయి. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతకు ముందు శరత్ కుమార్, రేసుగుర్రం విలన్ రవికిషన్‌ అలాగే మరో హీరోతో కూడా లవ్ స్టోరీ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ అమ్మడు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్ళికి రెడీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. 49 ఏళ్ల వయసులో నగ్మా పెళ్ళికి రెడీ అయ్యిందని వార్తలు పుట్టుకొచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us