AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు విషయంలో బ్రహ్మానందంతో గొడవ.. మధ్యలో మోహన్ బాబు రావడంతో.. శివాజీ రాజా కామెంట్స్

పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు శివాజీ. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. బాలకృష్ణ నటించిన సీతారామకళ్యాణంలో చిన్న పాత్ర పోషించిన శివాజీరాజాకు కళ్లు చిత్రం బ్రేక్ ఇచ్చింది. మధ్యలో శివాజీ రాజా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అదే సమయంలో ఆయన మా అసౌసియేషన్ అద్యక్షుడిగాను చేశారు.

డబ్బు విషయంలో బ్రహ్మానందంతో గొడవ.. మధ్యలో మోహన్ బాబు రావడంతో.. శివాజీ రాజా కామెంట్స్
Shivaji Raja
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2024 | 10:42 AM

Share

టాలీవుడ్ లో ఎంతో మంది అద్భుతమైన నటీ నటులు ఉన్నారు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన వారు చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో శివాజీ రాజా ఒకరు. చాలా టాలెంటెడ్ నటుడు శివాజీ రాజా.. తన కామెడీ టైమింగ్ తో సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు శివాజీ. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. బాలకృష్ణ నటించిన సీతారామకళ్యాణంలో చిన్న పాత్ర పోషించిన శివాజీరాజాకు కళ్లు చిత్రం బ్రేక్ ఇచ్చింది. మధ్యలో శివాజీ రాజా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అదే సమయంలో ఆయన మా అసౌసియేషన్ అద్యక్షుడిగాను చేశారు. అదే సమయంలో పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. శివాజీ రాజా వందిలాది చిత్రాల్లో నటించారు.

స్వతహాగా స్నేహశీలి అయిన శివాజీ రాజా ఎవరితోనూ వివాదాలు పెట్టుకోరు. కానీ ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎదుటి వారు ఎవరైనా సరే ఢీ కొడతారు. కాగా శివాజీ రాజా ఒకేసారి బ్రహ్మానందంతో గొడవపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ.. ఒకేసారి బ్రహ్మానందం తో జరిగిన గొడవగురించి చెప్పారు.

తనికెళ్ల భరణి , మల్లిఖార్జునరావు బ్రహ్మానందం ఇలా కొంతమంది హాస్యనటులతో కలిసి ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. అయితే ఈ ట్రస్ట్ లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసి.. నేను ఆపుకోలేక బ్రహ్మానందంను నిలదీశాను. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గట్టిగా అడిగాను. దాంతో అక్కడ కొంచం గొడవ జరిగింది. ఈ విషయం కాస్త మోహన్ బాబు, పరిటాల రవికి తెలిసింది. ఒకసారి మోహన్ బాబు ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మన్నారు. ఇంతలో శ్రీ హరి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉంది జాగ్రత్త అని చెప్పారు. నేను మోహన్ బాబు ఇంటికి వెళ్ళగానే కాఫీ తాగుదాం అని అన్నారు. తగిన తర్వాత గొడవ గురించి అడిగారు. నేను జరిగింది చెప్పాను. ఇంతలో పరిటాల రవి ఎందుకమ్మా ఈ గొడవలు. సైలెంట్ గా ఉండాలి అను సూచించారు. నేను బ్రహ్మానందంతో అన్ని సెటిల్ చేసుకున్నాను గొడవ ఏం లేదు అని చెప్పారు దాంతో మోహన్ బాబు మెచ్చుకొని అక్కడి నుంచి పంపేశారని శివాజీ రాజా అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.