Sayaji Shinde: రాజకీయాల్లోకి షాయాజీ షిండే.. అనూహ్యంగా ఆ పార్టీ కండువా కప్పుకున్న టాలీవుడ్ నటుడు

ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుతో పాటు హిందీ, తెలుగు తమిళ చిత్రాల్లో మెరిసిన ఆయన తాజాగా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన షాయాజీ షిండే శుక్రవారం (అక్టోబర్ 11)..

Sayaji Shinde: రాజకీయాల్లోకి షాయాజీ షిండే.. అనూహ్యంగా ఆ పార్టీ కండువా కప్పుకున్న టాలీవుడ్ నటుడు
Sayaji Shinde
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2024 | 8:03 PM

ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుతో పాటు హిందీ, తెలుగు తమిళ చిత్రాల్లో మెరిసిన ఆయన తాజాగా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన షాయాజీ షిండే శుక్రవారం (అక్టోబర్ 11) అధికారికంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో షాయాజీ షిండే చేరారు. ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మరి కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సతారా జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుంచి షాయాజీ షిండె ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు షిండే. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ నేను ఎక్కువగా సినిమాలు చూడను కానీ షాయాజీ షిండే గారి సినిమాలు చాలా చూస్తుంటాను. ఆయన చేపట్టిన చాలా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నన్ను కలిశారు. షిండేకు మొక్కలు, చెట్లన్నా చాలా ఇష్టం. ఆయన రాష్ట్రమంతటా మొక్కలు నాటారు. అలాగే సాయిబాబా, సిద్ధివినాయక్‌ బప్పా ప్రసాదంలా మొక్కలు కూడా ప్రసాదంగా ఇవ్వాలని సూచించారు. షాయాజీ ప్రతిపాదనలపై మేం చర్చిస్తున్నాం. ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు.

ఇక షాయాజీ షిండే సినిమాల విషయానికి వస్తే.. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత గుడుంబా శంకర్, ఆంధ్రావాలా, పోకిరి, అతడు, ఆంధ్రుడు, రాఖీ, లక్ష్మి, దేవదాసు, చిరుత, దుబాయ్ శీను, నేనింతే, కింగ్, కృష్ణ, ఆర్య 2, కిక్, అరుంధతి, అదుర్స్, ఊసరవెల్లి, బిజినెస్ మ్యాన్, బాద్‌ షా, రేసు గుర్రం, ధ్రువ, వకీల్ సాబ్, ఇస్మార్ట్ శంకర్, గాడ్ ఫాదర్, డబుల్ ఇస్మార్ట్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా షాయాజీ షిండే నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

షాయాజీ షిండేకు జెండా కప్పుతోన్న అజిత్ పవార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు