Actor Mohan Raj : ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత..
సౌత్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ కన్నుమూశారు. గురువారం మూడు గంటలకు కుమంకుళంలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు
సౌత్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ కన్నుమూశారు. గురువారం మూడు గంటలకు కుమంకుళంలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం మూడు గంటల సమయంలో కన్నుమూశారు. 1988లో మూడో ముర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. మోహన్ రాజ్ కు భార్య ఉష. జైష్మా, కావ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు పవర్ ఫుల్ విలన్ నటుడు మోహన్ రాజ్ . తెలుగులో లారీ డ్రైవర్, చినరాయుడు, రౌడీ రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహరాయుడు చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. మెగాస్టా్ర్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా కనిపించారు.
తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన మోహన్ రాజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా ఆయన మధురైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యూయేషన్ తర్వాత ఆర్మీలో పనిచేసిన ఆయన ఆ తర్వాత కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ కమిషనల్ హోదాలో కొనసాగుతున్నారు.
కొన్నాళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న మోహన్ రాజ్ గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన మోహన్ రాజ్ పదవీ విరమణ తర్వాత కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు. ఆయుర్వేద చికిత్స కోసం చెన్నై నుంచి ఏడాది క్రితం తిరువనంతపురం వచ్చాడు. ఆయన చివరిసారిగా నరసింహనాయుడు సినిమాలో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.