Actress: బాబోయ్.. 41 ఏళ్ల వయసులో ఇరగదీస్తోన్న హీరోయిన్.. ఇప్పుడు ఓటీటీలో ఆమె సెన్సేషన్..
ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేసేందుకు హీరోహీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తారలు.. అటు ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ ఓటీటీ సెన్సేషన్. ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.

ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది ఓ 41 ఏళ్ల హీరోయిన్. థియేటర్లలో కాకుండా ఆమె నటించిన చిత్రాలు, వెబ్ సిరీస్ మొత్తం సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు అందం, అభినయంతో ఓటీటీ ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది. సేక్రెడ్ గేమ్స్, పార్చ్, క్రిమినల్ జస్టిస్ వంటి షోలతో ఆమె రికార్డ్స్ బద్దలుకొట్టింది. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలతో నటిగా ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆ హీరోయిన్ పేరు సుర్వీన్ చావ్లా. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న అంధేరా చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్ 14 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది. రాఘవ్ దర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ప్రియా బాపట్, కరణవీర్ మల్హోత్రా , ప్రజక్తా కోలి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..
ఇందులో సుర్వీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతకు ముందు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన మాండ్లా మర్డర్స్ సిరీస్ లో అనన్య భరద్వాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సంవత్సరం, క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 లో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రానా నాయుడు సీజన్ 2 లోనూ నటించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె రంగ్‌బాజ్, సేక్రెడ్ గేమ్స్, పార్చ్డ్ వంటి ఓటీటీ ప్రాజెక్టులలో కనిపించింది.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఓటీటీలలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లకు మరింత ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సుర్వీన్ చావ్లా తన అందం, సహజమైన నటనతో కట్టిపడేస్తుంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ అమ్మడు తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..








