AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రామ్ చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?

మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో వీరు కూడా ఒకరు. వీరి సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్లు రికార్డులు బద్దలవుతాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయి.

Tollywood: రామ్ చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?
Ram Charan, Jr NTR, Mahesh Babu
Basha Shek
|

Updated on: Aug 24, 2025 | 5:33 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కథలు మారడమనేది సహజం. ఒక హీరో చేయాల్సిన కథతో మరో హీరో సినిమాలు చేయడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. ఎందుకంటే సినిమాల సెలెక్షన్ లో ఒక్కో హీరో అంచనా ఒక్కో విధంగా ఉంటుంది. అందుకు చాలా కాలిక్యులేషన్స, టర్మ్స్ ఉంటాయి. కొన్ని సార్లు ఒక హీరో వద్దనుకున్న కథతో మరో హీరో బ్లాక్ బస్టర్ కొట్టవచ్చు. అదే సమయంలో బోల్తా కూడా పడవచ్చు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పాడు కొరటాల. ఎన్టీఆర్ కూడా ఈ కథను విని బాగా ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఆ టైంలో ఎన్టీఆర్ సినిమా డైరీ పూర్తిగా నిండిపోయింది. దీంతో కొరటాల సినిమాను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. దీంతో వెంటనే రామ్ చరణ్ ను అప్రోచ్ అయ్యాడు స్టార్ డైరెక్టర్. బండ్ల గణేశ్ నిర్మాతగా ప్రాజెక్టు కూడా లాంఛనంగా మొదలైంది. అయితే ఎందుకో గానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కొరటాల మహేష్ బాబు దగ్గరకు వెళ్లి స్టోరీ వినిపించాడు. మహేష్ కూడా కొన్ని మార్పులు చేర్పులు సూచించి సినిమాకు ఒకే చెప్పాడు. దీంతో ఎట్టకేలకు కొరటాల సినిమా పట్టాలెక్కింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా.. చరణ్ తో ఆగిపోయిన సినిమా.. మహేష్ బాబు ఒకే చెప్పిన సినిమా ఒక్కటే అదే శ్రీమంతుడు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం శ్రీమంతుడు. 2015 ఆగస్టు 07న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై నిన్నటికీ పదేళ్లు పూర్తయ్యాయి. మహేష్ బాబు కెరీర్ లో శ్రీమంతుడు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడమన్న కాన్సెప్టుకు కాస్త కమర్షియల్ హంగులను జోడించి ఎంటర్ టైనింగ్ గా తీర్చిదిద్దారు కొరటాల శివ. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే జగపతిబాబు మహేష్ తండ్రిగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.

శ్రీమంతుడు రిలీజై పదేళ్లు..

శ్రీమంతుడు సినిమా కోసం కొరటాల శివ కష్టపడిన తీరును చూసి మహేష్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడు. అలా ఆ తర్వాత వీరి కాంబినేషన్ లోనే ‘భరత్ అనే నేను’ అనే మరో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.