Tollywood: ఈవారం థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. శాకుంతలం నుంచి.. ధమ్కీ వరకు..
ప్రతి వారం ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తుండగా.. ఈ వారం మరింత జోష్ పెరగనుంది. గతవారం రావణాసుర, మీటర్ వంటి విడుదలయ్యి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మరింత వినోదాన్ని పంచేందుకు చిన్నా, పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరీ ఈవారం థియేటర్లలో.. ఓటీటీలలో విడుదల కాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

సమ్మర్ సిత్రాల సందడి మొదలైంది. ఇప్పుడు థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ అన్ లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ముఖ్యంగా తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రతి వారం ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తుండగా.. ఈ వారం మరింత జోష్ పెరగనుంది. గతవారం రావణాసుర, మీటర్ వంటి విడుదలయ్యి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మరింత వినోదాన్ని పంచేందుకు చిన్నా, పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరీ ఈవారం థియేటర్లలో.. ఓటీటీలలో విడుదల కాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
శాకుంతలం.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత.. దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. ఇందులో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు.
రుద్రుడు.. రాఘవ లారెన్స్.. ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం రుద్రుడు. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇందులో శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.




విడుదల.. తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా విడుదల. ఇప్పటికే ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన ఈ సినిమా.. కాస్త ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 15న తెలుగులో విడుదల చేయనున్నారు. సూరి, విజయ్ సేతుపతి కీలకపాత్రలలో నటించిన ఈ మూవీకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.
ఓటీటీలో అలరించే సినిమాలు..
ఆహా.. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ కలిసి నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పుడు ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్.. పూర్ణ, సూర్యకుమార్, సత్యకృష్ణన్ కీలకపాత్రలలో నటించిన చిత్రం అసలు. ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 13న ఈటీవీ విన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెజాన్.. ది మార్వెలస్ మిస్సెస్ .. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 14
డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. టైనీ బ్యూటిఫుల్ థింగ్స్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 9. ఓ కల.. తెలుగు.. ఏప్రిల్ 13
నెట్ ఫ్లిక్స్.. ఫ్లోరియా మాన్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 13 అబ్సెషన్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 13 క్వీన్ మేకర్.. కొరియన్ సిరీస్.. ఏప్రిల్ 14 ది లాస్ట్ కింగ్ డమ్.. హాలీవుడ్.. ఏప్రిల్ 14
జీ5.. మిస్సెస్ అండర్ కవర్ .. హిందీ ఏప్రిల్.. 14
