Rajitha Chanti |
Updated on: Apr 10, 2023 | 11:35 AM
తెలుగు చిత్రపరిశ్రమలో అందం.. అభినయంతో మెప్పించినా తారమణుల గురించి చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ప్రియాంక మోహన్ ఒకరు.
తమిళ్ అమ్మాయే అయినా.. కన్నడ సినిమా ఓంద్ కథే హెల్లాతో పరిచయమైంది. ఆ సినిమాతోనే ఇంప్రెస్ చేసిన అమ్మడు నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తెలుగులో ప్రియాంకా కెరీర్ అంతగా క్లిక్ అవ్వలేదు. ఆ వెంటనే శర్వానంద్ జోడిగా శ్రీకారం సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా అంతగా లాభం తెచ్చిపెట్టలేదు.
కానీ తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ హీరోయిన్ అయ్యింది. శివ కార్తికేయన్, సూర్యతో కలిసి నటించిన చిత్రాలు ఈ అమ్మడుకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెప్టెన్ మిల్లర్ ఎం. రాజేష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది ప్రియాంక. గ్లామర్ షోకి ఆమడ దూరంలో ఉంటున్న ఈ అమ్మడు క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.
అందం, అభినయం రెండు ఉన్నా సరే ఈ బ్యూటీకి మాత్రం అంతగా ఛాన్స్ రావడం లేదు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం లేవు.
తెలుగులో స్టార్ క్రేజ్ వస్తే హీరోయిన్స్ కు సౌత్ అంతటా డిమాండ్ ఉంటుంది. కానీ ఈ అమ్మడికి మాత్రం అంతగా ఆఫర్స్ మాత్రం రావట్లేదు.