Raja Saab : ప్రభాస్ జోకర్ లుక్ అందుకే.. రాజా సాబ్ 2 గురించి లీక్ చేసిన డైరెక్టర్ మారుతీ..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రాజాసాబ్ ఒకటి. చాలా సంవత్సరాల తర్వాత డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న హారర్ అండ్ కామెడీ డ్రామా. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ది రాజాసాబ్. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత డార్లింగ్ మరోసారి తనదైన కామెడీతో ఆకట్టుకోనున్నాడు. దీంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
రాజా సాబ్ ప్రమోషన్స్ ఎంతో వేగంగా జరుగుతున్నాయి. చిత్రయూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ మారుతీ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజా సాబ్ 2 గురించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. తన తెలియకుండానే రాజాసాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ జోకర్ లుక్ గురించి ప్రశ్నించగా.. ఒక ఐకానిక్ పాత్రను మళ్లీ చేయడానికి స్టార్స్ ముందుకు రారు. అందుకు ప్రభాస్ ను ఎలా ఒప్పించారు అని అడిగారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఇందుకు డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. “ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించడానికి పెద్ద కథే ఉంది. అది రాజాసాబ్ పార్ట్ 2లో ఉంటుంది. ఆ లుక్ కు సంబంధించిన ప్రాధాన్యతను ప్రభాస్ కు చెప్పాను.. ఆయన ఒప్పుకున్నాడు” అని అన్నారు. దీంతో మాట్లాడుతూనే రాజా సాబ్ పార్ట్ 2 ఉంటుందని చెప్పేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
