వాళ్లు అడిగింది ఇవ్వకపోతే.. కావాలనే సినిమాల్లో నుంచి తీసేస్తారు.. అపూర్వ సెన్సేషనల్ కామెంట్స్
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఎంతో మంది నటీ నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ప్రేక్షకులను మెప్పించారు. రకరకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన వారిలో అపూర్వ ఒకరు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి అపూర్వ. ఆ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది. వయసు చిన్నదే అయినప్పటికీ ఆమె అల్లరి నరేష్ తల్లిపాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు అపూర్వ సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న అపూర్వ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియతో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అపూర్వ.
గతంలో ఓ ఇంటర్వ్యూలో అపూర్వ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ నటీమణులు కమిట్‌మెంట్కు సిద్ధంగా ఉంటారనే వాదనలో నిజం లేదని అపూర్వ అన్నారు. కమిట్‌మెంట్ అనేది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, లేదా మరే ఇతర పరిశ్రమ అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహనపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తెలుగు అమ్మాయిలకు ప్రధాన పాత్రలు ఇవ్వడం లేదని, చిన్న చిన్న పాత్రలే ఇస్తున్నారని వస్తున్న విమర్శల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఒకసారి కమిట్‌మెంట్ ఇస్తే కూడా అవకాశాలు రావడం లేదన్న వాదనలను అపూర్వ తోసిపుచ్చారు. ఒక అవకాశం చూశాక, పరిస్థితి అర్థమయ్యాక రెండో అవకాశం కోసం అదే పంథాలో వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో స్టార్‌డమ్ సాధించిన తర్వాత నటీనటుల ప్రయాణం ఎలా మారుతుందో అపూర్వ వివరించారు. స్టార్‌డమ్ లేనప్పుడు నటీనటులు అవకాశాల కోసం పరిశ్రమ చుట్టూ తిరగాల్సి వస్తుందని, కానీ ఒక్కసారి హిట్ పడ్డాక, స్టార్‌డమ్ వచ్చాక పరిశ్రమే వారి చుట్టూ తిరుగుతుందని ఆమె అన్నారు. నిత్యా మీనన్, భూమిక చావ్లా వంటి కొందరు నటీమణులు తొలి సినిమా హిట్‌తోనే మంచి పేరు తెచ్చుకోవడం వల్ల, వారికి కమిట్‌మెంట్ వంటి సమస్యలు ఎదురై ఉండకపోవచ్చని అపూర్వ అన్నారు. కొందరు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు కూడా కాస్టింగ్ కౌచ్లో భాగమేనని అపూర్వ అన్నారు. మీడియా ముందు మంచి మాటలు చెప్పే కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా తెర వెనుక ఇలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకుంటారని ఆమె తెలిపారు. తన ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో తొలి ఒకటి, రెండు చిత్రాల సమయంలో కమిట్‌మెంట్ సమస్యలను తాను కూడా ఎదుర్కొన్నానని అపూర్వ వెల్లడించారు. ఆ ఆఫర్లను నిరాకరించినప్పుడు, సినిమాల నుంచి తొలగించడం, లేదా డేట్లు చెప్పిన తర్వాత కూడా మార్చేయడం, లేదా తమను చూసి తెలియని విధంగా ప్రవర్తించడం వంటి అనుభవాలు తనకు ఎదురయ్యాయని అపూర్వ చెప్పారు.. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




