AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies: వచ్చేస్తుంది వినోదాల జాతర.. జూన్ నుంచి ఆగస్ట్ వరకు సినీ ప్రియులకు పండగే..

జూన్ నుంచి ఆగస్ట్ వరకు చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోల చిత్రాలు సైతం సందడి చేయనున్నాయి..

Upcoming Movies: వచ్చేస్తుంది వినోదాల జాతర.. జూన్ నుంచి ఆగస్ట్ వరకు సినీ ప్రియులకు పండగే..
Upcoming
Rajitha Chanti
|

Updated on: May 22, 2022 | 11:40 AM

Share

గత కొద్ది రోజులుగా థియేటర్లలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించగా.. మరోవైపు చిన్న సినిమాలు సైతం సూపర్ హిట్ టాక్‍తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ వేసవిలో సినీ ప్రియులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు వర్షకాలం ప్రారంభం కాబోతుంది. అలాగే స్కూల్స్ రీఒపెనింగ్ కావడం.. ఓవైపు పిల్లలు చదువులతో బిజీ కావడం.. వానలు విపరీతంగా కురవడంతో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి తగ్గిపోతుంది. దీంతో ఈ వర్షకాలంలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడమనేది చాలా అరుదు.. కానీ ఈ ఏడాది మాత్రం జూన్ నుంచి ఆగస్ట్ వరకు చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోల చిత్రాలు సైతం సందడి చేయనున్నాయి.. వరుసగా ఈ మూడు నెలల్లో పలు చిత్రాలు విడుదల కానున్నాయి. అవెంటో తెలుసుకుందామా..

ముందుగా జూన్ నెలలో నాలుగు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అందులో న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికీ సినిమా. ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. కమల్ హాసన్.. విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ మూవీ జూన్ 3న విడుదల కానుంది. అలాగే.. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ సినిమా సైతం జూన్ 3న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాలపై మరింత ఆసక్తిని పెంచాయి.. అలాగే.. మాస్ మాహారాజా నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తోన్న గాడ్సే సైతం జూన్ 17న రిలీజ్ కానుంది. ఇవే కాకుండా.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సమ్మతమే సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక జూలైలోనూ వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అందులో గోపిచంద్ నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న విడుదల కానుండగా.. అదే రోజున రానా.. సాయి పల్లవి నటించిన విరాటపర్వం, వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న రంగ రంగ వైభవంగా సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి..అలాగే అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించి థ్యాంక్యూ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో రాబోతున్న మాస్ యాక్షన్ చిత్రం ది వారియర్.. జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 15న లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్ డే సినిమా రిలీజ్ కానుండగా.. నిఖిల్ నటిస్తోన్న కార్తికేయ 2.. జూలై 22న.. కిచ్చా సుదీప్ నటిస్తున్న విక్రాంత్ రోణ జూలై 28 విడుదల కానున్నాయి.. అలాగే అడివి శేష్ నటిస్తోన్న హిట్ 2 చిత్రం జూలై 28న రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆగస్టు నెలలో కళ్యాణ్ రామ్ నటించి బింబిసార ఆగస్ట్ 5న.. సమంత పాన్ ఇండియా చిత్రం యశోద సినిమా ఆగస్ట్ 12న విడుదల కానున్నాయి. అక్కినేని అఖిల్ ఏజెంట్ సైతం ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది.. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం లైగర్ ఆగస్ట్ 25న ప్రేక్షకులే ముందుకు రానుంది. మొత్తానికి వర్షకాలంలో ఈ మూడు నెలలు సినీ ప్రియులను మరింత వినోదాన్ని అందించనున్నాయి.