Tollywood: దసరా కానుకగా రీలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలు ఇవే.. ఈసారి గట్టిపోటీ ఖాయం గురూ..

ఈ దసరా పండగకు భారీగా సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tollywood: దసరా కానుకగా రీలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలు ఇవే.. ఈసారి గట్టిపోటీ ఖాయం గురూ..
Tollywood
Follow us

|

Updated on: Feb 05, 2023 | 5:05 PM

పండగలు వచ్చాయంటే చాలు సినిమా ఇండస్ట్రీకి సినిమాల సీజన్ వచ్చినట్టే.. పెద్ద పండగలను టార్గెట్ చేసుకొని సినిమాలను రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతికి బడా సినిమాలు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు దసరా పై గురిపెట్టారు మేకర్స్. ఈ దసరా పండగకు భారీగా సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ దసరాను టార్గెట్ చేసిన సినిమాలు ఏవంటే..

దసరా పండగ పురస్కరించుకొని సినీ లవర్స్ కు ఫుల్ కిక్ ఇవ్వనున్నారు మూవీ మేకర్స్.. బడా సినిమాలను వరుసగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా పైనే అందరి దృష్టి ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రానుంది. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా దసరానే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించనుందట. అలాగే హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా అదే పండగ రోజు రిలీజ్ చేయనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో