Fourth Time: కలిసొచ్చిన డైరెక్టర్స్‌తోనే సినిమా అంటున్న స్టార్ హీరోలు
ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటే... ఆ క్రేజ్ ఇంకే రేంజ్‌లో ఉంటుంది. అప్ కమింగ్ సినిమాల్లో అలాంటి ప్రాజెక్ట్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ, యాక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి.
సూపర్ హిట్ కాంబినేషన్స్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే అలాంటి కాంబినేషన్స్‌ను మళ్లీ మళ్లీ రిపీట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. అదే ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటే… ఆ క్రేజ్ ఇంకే రేంజ్‌లో ఉంటుంది. అప్ కమింగ్ సినిమాల్లో అలాంటి ప్రాజెక్ట్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ, యాక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. డాన్, బలుపు, క్రాక్ లాంటి సినిమాల్లో రవితేజ కామెడీ, మాస్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్న గోపిచంద్… మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మరో సూపర్ హిట్ కాంబో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను. మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే ఈ కాంబో మీద అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
ఈ లిస్ట్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్న ఇంట్రస్టింగ్ కాంబినేషన్ అల్లు అర్జున్, త్రివిక్రమ్. బన్నీ ఎనర్జీని పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేసే కథలు ఇవ్వటంలో గురూజీ సూపర్ సక్సెస్ అయ్యారు. అందుకే ఈ కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేయబోతున్నారు.
జులాయి లాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి ఫ్యామిలీ డ్రామా, రీసెంట్‌గా అలవైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. ఇప్పుడు అంతకు మించి అన్న రేంజ్‌లో భారీ పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేశారు. ఇలా వరుసగా రిపీట్ కాంబినేషన్స్ ట్రెండ్ అవుతుండటం ఇండస్ట్రీలో సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.