Tollywood : టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ దర్శకులు.. మనోళ్లు మామూలోళ్లు కాదుగా
వాళ్లు నెక్ట్స్ లెవల్ అంతే. ఓ పక్క సినిమా తీస్తూనే.. మరోపక్క పాటలు రాస్తూ తమ రైటింగ్ స్కిల్స్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ మధ్య డైరెక్టర్స్ కమ్ లిరిసిస్ట్స్ ఎక్కువైపోయారు. మరి వాళ్లెవరు..?

ఎంతైనా మన దర్శకులు మల్టీ టాలెంటెడ్.. ఒకరేమో డైరెక్షన్ చేస్తూ నటిస్తారు.. మరొకరేమో మాటలు రాస్తారు.. ఇంకొకరు సినిమాలు నిర్మిస్తుంటారు. ఇవన్నీ అందరూ చేస్తున్నారు. కానీ ఇంకోరకం దర్శకులున్నారు.. వాళ్లు నెక్ట్స్ లెవల్ అంతే. ఓ పక్క సినిమా తీస్తూనే.. మరోపక్క పాటలు రాస్తూ తమ రైటింగ్ స్కిల్స్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ మధ్య డైరెక్టర్స్ కమ్ లిరిసిస్ట్స్ ఎక్కువైపోయారు. మరి వాళ్లెవరు..?ఒకప్పుడు దాసరి నారాయణరావు తన సినిమాలో సిచ్యువేషన్స్‌కు తగ్గట్లు కొన్ని పాటలు ఆయనే రాసేవాళ్లు. ఆ తర్వాత అలా పాటలు రాసే దర్శకులు కనబడట్లేదు. కానీ ఈ మధ్య మళ్లీ ఆ ట్రెండ్ కనిపిస్తుంది. తాజాగా శివ నిర్వాణ డైరెక్టర్‌గానే కాకుండా లిరిసిస్ట్‌గానూ ఆకట్టుకుంటున్నారు. నాని టక్ జగదీష్ సినిమాలో టైటిల్ సాంగ్ రాసిన ఈయన.. ఖుషీలో ఇప్పటి వరకు రిలీజైన రెండు పాటలు రాసారు.
ఖుషీలో నా రోజా నువ్వే పాటలో మణిరత్నంకు సినిమా పేర్లతో ట్రిబ్యూట్ ఇచ్చారు శివ. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన రొమాంటిక్ ఆరాధ్యను కూడా శివ నిర్వాణే రాసారు. సిధ్ శ్రీరామ్, చిన్మయి పాడిన ఈ పాట ఇన్‌స్టంట్ హిట్టైంది. ఇందులోనూ పద ప్రయోగాలు బానే చేసి లిరిక్స్ పరంగా సత్తా చూపించారు శివ నిర్వాణ.
ఈ మధ్య త్రివిక్రమ్ సైతం పాటలు రాస్తున్నారు. నిజానికి 2003లో రవితేజ నటించిన ఒకరాజు ఒకరాణి సినిమాలో పాటలన్నీ రాసింది మాటల మాంత్రికుడే. కాకపోతే సినిమా ఫ్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ లిరిక్స్ పవర్ ఎవరూ గుర్తించలేదు. కానీ భీమ్లా నాయక్‌లో లాలా భీమ్లా.. గుంటూరు కారం టీజర్లో వచ్చే సాంగ్ రాసింది గురూజీనే. ఇప్పుడు ఈయన లిరిక్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ కూడా ఆ సినిమాలో ఓ పాట రాసారు. ఆల్మోస్ట్ పాన్ ఇండియా అంటూ సాగే ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రాధన్‌తో కలిసి రాసారు అనుదీప్. మొత్తానికి మన దర్శకులు మెగాఫోన్‌తో పాటు పెన్ పట్టి పాటలు కూడా బాగానే రాస్తున్నారు.




