Akhanda: అఖండ సినిమాకు బ్రేక్ వేసి షాక్ ఇచ్చిన అధికారులు.. బెనిఫిట్ షో వేశారని థియేటర్ సీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గురువారం రోజున భారీగా విడుదలైంది.. చాలా కాలంగా పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్న
Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గురువారం రోజున భారీగా విడుదలైంది.. చాలా కాలంగా పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అఖండ రూపంలో సాలిడ్ సినిమా దొరికింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది.. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఇక గురువారం రోజున అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏపీలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఏపీలో బెనిఫిట్ షోలు నిలిపివేశారు. అయితే కొన్ని థియేటర్స్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు..
ప్రభుత్వ ఆదేశాలు పాటించని సినిమా థియేటర్ పై రెవెన్యూశాఖ చర్యలు తీసుకున్నారు. తాడేపల్లి లో నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలు వేసిన రామకృష్ష్న సినిమా థియేటర్ ను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. రెండు స్క్రీన్లలో రూల్స్ బ్రేక్ చేసిన స్క్రీన్ ని సీజ్ చేశామని.. మరో స్క్రీన్ ని యథాతథంగా రన్ అవుతోందని అధికారులు తెలిపారు. రోజుకు నాలుగు షోలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉందని వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :