AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. చిన్న సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది

డైరెక్టర్ శైలు కంపాటి రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రస్థానం ఆసక్తికరంగా సాగింది. ఇండస్ట్రీలో పలువురు హీరోలకు కథ చెప్పగా.. వాళ్లు రిజెక్ట్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల, వేణు, సురేష్ బొబ్బిలి లాంటివారి సహకారంతో, అనేక కష్టాలను అధిగమించి, డెమో రీల్ తయారుచేసి, చివరికి కొత్త నటీనటులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. చిన్న సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది
Breaking
Ravi Kiran
|

Updated on: Apr 09, 2026 | 6:44 PM

Share

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర దర్శకుడు శైలు కంపాటి తన సినీ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లు, తొలి సినిమా అవకాశం కోసం చేసిన సుదీర్ఘ పోరాటాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2015లో ఇండస్ట్రీకి వచ్చిన శైలుకు, ముఖ్యంగా 2017 నుంచి 2019 వరకు కఠినమైన కాలమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక దశలో ఇంటికి వెళ్లిపోయినా, చిరంజీవి అభిమాని అయిన తన తండ్రి ప్రోత్సాహంతో మళ్ళీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపారు. సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను కలిసినా, అనుభవం లేకపోవడంతో టీమ్‌లో చేర్చుకోలేకపోయారు. బతుకుదెరువు కోసం కొంతకాలం స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. అనంతరం ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణుని కలవడానికి చేసిన ప్రయత్నాలు, సురేష్ బొబ్బిలి సహాయంతో ఆయనతో మాట్లాడటం వంటి సంఘటనలను శైలు గుర్తు చేసుకున్నారు. విరాటపర్వం సినిమాతో వేణు బిజీగా ఉన్నప్పటికీ, తన కథను విని ప్రోత్సహించారని చెప్పారు.

ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి

లాక్‌డౌన్ సమయంలో తీవ్ర నిరాశకు గురైన శైలు, ఆ తర్వాత ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాకు పనిచేసి ఆదా చేసుకున్న 30 వేల రూపాయలతో తన కథకు ఒక ‘డెమో రీల్’ తయారు చేశారు. ఆ డెమో చూసి వేణు మెచ్చుకోవడంతో, దానిని పట్టుకుని పలువురు నిర్మాతలు, హీరోల చుట్టూ తిరిగారు. ఛాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ లాంటివారు కథలో మార్పులు కోరగా, తన విజన్ దెబ్బతింటుందని శైలు అందుకు అంగీకరించలేదు. తర్వాత సుమంత్ ప్రభాస్, పెద్ద కాపు నటుడు లాంటి పలువురు యువ హీరోలకు కథ వినిపించినా రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్ కుదరలేదు. ఎన్నో రిజెక్ట్‌లు ఎదుర్కొన్న తర్వాత, తన కథకు కొత్త నటీనటులే సరైన న్యాయం చేస్తారని శైలు కంపాటి భావించారు. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలంటే కొత్త ముఖాలు ఉండాలనే ఉద్దేశంతోనే ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని కొత్తవారితో తెరకెక్కించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, సినిమా రిలీజ్ అయి.. అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?

Follow Us