షాపింగ్ మాల్స్‌లో పార్ట్ టైమ్ జాబ్.. ఇప్పుడు 3 నిమిషాలకు 5 కోట్లు..
Rajitha Chanti
Pic credit - Instagram
29 April 2026
భారతీయ చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా టాలీవుడ్‌లో 'సమంత' అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
సమంత చెన్నైలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న సమయంలో, ఆమె చదువుకుంటూనే చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేవారు.
ఈ క్రమంలోనే ఒక హోటల్‌లో అతిథులను ఆహ్వానించే (Hostess) పని కోసం ఆమెకు మొదటిసారిగా రూ. 500 వేతనం లభించింది. ఆ చిన్న మొత్తం ఆమె జీవితంలో మొదటి సంపాదన.
మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సమంత, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
మొదటి సినిమాతోనే జెస్సీగా అందరి మనసు గెలుచుకుని, ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కెరీర్, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.
అనారోగ్య సమస్యలు (మయోసైటిస్), వైవాహిక జీవితంలోని మార్పులు ఆమెను కృంగదీసినప్పటికీ, ఆమె మరింత బలమైన వ్యక్తిగా తిరిగి వచ్చారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే నిర్మాతగానూ రాణిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫిట్నెస్, ఆరోగ్యంకు సంబంధించిన పలు విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు.