Om Shanti Shanti Shantihi Teaser: ఆసక్తికరంగా తరుణ్ భాస్కర్ మూవీ టీజర్.. మీరూ ఓ లుక్కేయండి
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఏ ఆర్ సజీవ్, ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న సినిమా.. ఓం శాంతి శాంతి శాంతిః, ఈ మూవీ హ్యూమరస్ టీజర్ ను తాజాగా లాంచ్ చేశారు. ఇక ఈ సినిమాను జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు .

ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా తెరపై అలరిస్తున్నారు. ‘ఓం శాంతి శాంతి శాంతిః అనే కొత్త ప్రాజెక్ట్‌లో మరోసారి లీడ్‌లో చేస్తున్నారు. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా మద్దతునిస్తున్నాయి, సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ ,నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తున్నారు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం షూటింగ్ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ద్వారా ప్రమోషన్లపై మొదలుపెట్టింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్ లో కథ అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఓర్పు, సర్దుబాటును కలిగి ఉన్న మంచి, క్రమశిక్షణ కలిగిన మహిళ కొండవీటి ప్రశాంతిని వివాహం చేసుకుంటాడు. వారి విభిన్న వ్యక్తిత్వాలు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాకి వేదికగా నిలిచాయి, టీజర్ సూచించినట్లుగా, ఈ కుటుంబ కథా చిత్రంలో ఊహించని మలుపు వుంది.
దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దీనిని భిన్నమైన, నవ్వించే మూమెంట్స్ నిండిన ఆరోగ్యకరమైన ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. రైటింగ్, కథనం అందరినీ ఆకట్టునేలా వుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యెరగర గోదావరి జిల్లాల అందాన్ని ఆకట్టుకునే, కంటికి ఆహ్లాదకరమైన ఫ్రేమ్‌లతో తీశారు, జే క్రిష్ సంగీతం ముఖ్యంగా ఉల్లాసమైన థీమ్ ట్రాక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు గొప్పగా వున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే పాత్రలో తరుణ్ భాస్కర్ తన నటనతో కట్టిపడేశారు. ఐపిఎల్ సంభాషణ తన పాత్రని హైలైట్ చేసే హ్యూమరస్ బిట్‌గా నిలుస్తుంది. ఈషా రెబ్బా తన పాత్రలో ఆకట్టుకుంది. అద్భుతమైన వినోదంతో టీజర్ ప్రామెసింగ్ వుంది. లాంగ్ వీకెండ్ ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్ లో సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




