100 పర్సెంట్ లవ్ మిస్ చేసుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా.. ఆ సినిమా చేసుంటే మరోలా
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య

అక్కినేని అందగాడు నాగ చైతన్య కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ 100 పర్సెంట్ లవ్ మూవీ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. 2011లో రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. నాగ చైతన్య కంటే ముందు ఈ సినిమా ఆఫర్ ఓ యంగ్ హీరోకు వచ్చిందట. కానీ ఏమైందో ఏమో కానీ ఆయనను పక్కన పెట్టేసి నాగ చైతన్యతో సినిమా చేశారట సుకుమార్.
ఇంతకు 100 పర్సెంట్ లవ్ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే.. అతను మరెవరో కాదు వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేశాడు. కానీ తగినంత గుర్తింపు తెచుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. తాను మిస్ చేసుకున్న సినిమాల గురించి తెలిపాడు.
100 పర్సెంట్ లవ్ సినిమాలో ముందుగా హీరోగా తననే అనుకున్నారని తెలిపాడు. అంతా ఓకే అనుకున్న సమయంలో సడన్ గా నాగ చైతన్య ఈ సినిమా చేస్తున్నారని చెప్పారు. కారణం కూడా నాకు ఏం చెప్పలేదు. నేను కూడా ఓకే అని లైట్ తీసుకున్నా.. అని తెలిపాడు. అలాగే అదే సమయంలో వరుణ్ సందేశ్ చేసిన మరో చరిత్ర సినిమా ఫ్లాప్ అవ్వడం కూడా కారణం అయ్యుండొచ్చేమో అని అన్నారు. 100 పర్సెంట్ లవ్ సినిమా వరుణ్ సందేశ్ చేసుంటే ఆయన కెరీర్ టర్న్ అయ్యుండేది. ఇప్పుడు స్టార్ హీరోగా బిజీ అయ్యేవాడు అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




