Leo Movie : విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. దళపతి విజయ్ లియో కోసం భారీ ప్లాన్
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా పెద్ద హిట్ అయ్యింది, షారుక్ ఖాన్ నటించిన జవాన్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. వీరిద్దరి కంటే ముందే విడుదలైన కమల్ హాసన్ 'విక్రమ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు అందరి చూపు దళపతి విజయ్ నటిస్తున్న లియో పైనే ఉంది. 'లియో' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం . లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
కోలీవుడ్ లో సస్సెస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్.. వరుసగా అక్కడి సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా పెద్ద హిట్ అయ్యింది, షారుక్ ఖాన్ నటించిన జవాన్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. వీరిద్దరి కంటే ముందే విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు అందరి చూపు దళపతి విజయ్ నటిస్తున్న లియో పైనే ఉంది. ‘లియో’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం . లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేష్ ఇప్పుడు లియో సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడని అందరిలో ఆసక్తి నెలకొంది.
అనుకున్న సమయానికంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎక్కువ సమయం తీసుకోనుంది. ఈ సినిమాను తనదైన స్టైల్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు లోకేష్. గతంలో విజయ్ లోకేష్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
దళపతి విజయ్ ఎక్కువగా తన సినిమా ప్రమోషన్స్ లో కనిపించడు. అందరు హీరోల్లా వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాడు. కేవలం ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే కనిపిస్తాడు. కావాల్సినంత ప్రమోట్ చేస్తాడు. అయితే ఈసారి లియోకి కూడా అదే చేయబోతున్నారు. అయితే లియో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విదేశాల్లో చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. ప్రతిసారి విజయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చెన్నై లేదా అక్కడి నగరాల్లో నిర్వస్తు ఉంటారు. కానీ ఈసారి లియో సినిమా ఈవెంట్ ను మలేషియాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 14న మలేషియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ వేడుకలో నటీనటులు విజయ్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, నటి త్రిష, దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పాల్గొంటారని తెలుస్తోంది. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్నఆరో సినిమా లియో. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..