‘తుపాకి’ సీక్వెల్​లో మిల్కీ బ్యూటీ !

తమిళ స్టార్​ హీరో విజయ్​, డైరెక్ట‌ర్‌ మురుగదాస్​ కాంబినేషన్​లో 2012లో వ‌చ్చిన చిత్రం 'తుపాకి'. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూప‌ర్‌హిట్ అయ్యింది.

'తుపాకి' సీక్వెల్​లో మిల్కీ బ్యూటీ !
Ram Naramaneni

|

Sep 01, 2020 | 12:48 PM

తమిళ స్టార్​ హీరో విజయ్​, డైరెక్ట‌ర్‌ మురుగదాస్​ కాంబినేషన్​లో 2012లో వ‌చ్చిన చిత్రం ‘తుపాకి’. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూప‌ర్‌హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం మూవీకి సీక్వెల్ తెరకెక్కించడానికి ప్లానింగ్ జ‌రుగుతుంది. ఇందులో విజయ్​ సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్​గా ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఎస్పీ రాజ్​కుమార్​ దర్శకత్వంలో విజయ్​-తమన్నాలు కలిసి నటించిన ‘సుర’ సినిమా 2010లో రిలీజైంది. దాదాపు పదేళ్ల అనంత‌రం మురుగదాస్​ సినిమా కోసం వీరిద్దరూ మళ్లీ కలిసి నటించనున్నారని కోలీవుడ్​ కోడై కూస్తుంది. విజయ్​ ప్రస్తుతం ‘మాస్టర్’​ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు త‌మ‌న్నా… సంపత్​ నంది, హీరో గోపించంద్‌తో తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’​లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి​గా నటిస్తోంది.

Also Read :

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu