AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్ హీరో.. ఆటోలో ప్రయాణించిన అజిత్

తమిళ్ స్టార్ హీరో అజిత్ చాలా సింపుల్ గా ఉంటారు. టైం దొరికితే చాలు కామన్ మ్యాన్ గా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు

Ajith Kumar : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్ హీరో.. ఆటోలో ప్రయాణించిన అజిత్
Ajith
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2021 | 9:26 PM

Share

Ajith Kumar: తమిళ్ స్టార్ హీరో అజిత్ చాలా సింపుల్ గా ఉంటారు. టైం దొరికితే చాలు కామన్ మ్యాన్ గా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమలేఖ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అజిత్ నటించిన అన్ని సినిమాలో తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.

ఇటీవల హైదరాబాద్ రోడ్లపై సైకిలింగ్ చేస్తూ కనిపించాడు అజిత్. అజిత్ కు హైద‌రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అజిత్ హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. హీరో కాకముందు హైదరాబాద్ లోనే బైక్ మెకానిక్ గా ప‌నిచేశాడు. త‌న‌కు వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా హైద‌రాబాద్‌కు వ‌చ్చి వెళ్తుంటాడు.

స్టార్ హీరోగా స్వయంకృషి ఎదిగిన అజిత్ ను అభిమానులు ముద్దుగా ‘మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ’అని పిలుస్తుంటారు. తాజాగా మరోసారి త సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు అజిత్. అజిత్ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖరీదైన కార్లలో కాకుండా ఇలా ఆటోలో తిరుగుతూ అజిత్ కనిపించరు. అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది.ఆ తర్వాత స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు. తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jathi Ratnalu: బాహుబలి సినిమా కలెక్షన్స్ ను బీట్ చేసిన జాతిరత్నాలు.. ఎంత వసూల్ చేసిందటే

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..