Jathi Ratnalu: బాహుబలి సినిమా కలెక్షన్స్ ను బీట్ చేసిన జాతిరత్నాలు.. ఎంత వసూల్ చేసిందటే

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి  హీరోగా తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. మొదటి సినిమా ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నవీన్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమ‌ర్శ‌కుల

Jathi Ratnalu: బాహుబలి సినిమా కలెక్షన్స్ ను బీట్ చేసిన జాతిరత్నాలు.. ఎంత వసూల్ చేసిందటే
Jathi Ratnalu
Follow us
Rajeev Rayala

| Edited By: Team Veegam

Updated on: Mar 20, 2021 | 11:42 AM

Jathi Ratnalu: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి  హీరోగా తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. మొదటి సినిమా ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నవీన్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు న‌వీన్ పొలిశెట్టి. కామెడీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద డబ్బులు బాగానే వసులుచేసుకుంది. ఆతర్వాత దొరికిన సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు నవీన్. ఈ క్రమంలోనే జాతిరత్నాలు అనే సినిమా చేసాడు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారి జాతిరత్నాలు సినిమాను నిర్మించాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా తెరకెక్కింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇక మొదటి షో నుంచే భారీ రెస్పాన్స్ ను అందుకుంది ఈ సినిమా.

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుంది. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 23.09 కోట్లు షేర్ రూ. 36.90 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లోరూ. 1.18 కోట్లు.. ఓవర్సీస్ లో రూ. 3.43 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ‘జాతిరత్నాలు’ మొదటి వారంలో రూ. 27.70 కోట్లు షేర్ తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డునే దాటేసింది. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమాలకు సెంటర్ పాయింట్. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. వారం రోజుల్లో భారీ వసూళ్లను సాధించిన సినిమాల్లో జాతిరత్నాలు మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే బాహుబలి పార్ట్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా దాటేసింది. 2017 సంవత్సరం ఏప్రిల్ నెలలో బాహుబలి 2 విడుదలైంది.ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో ఒకటైన సుదర్శన థియేటర్లో 36 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది. అయితే ఆ రికార్డు ను గతఏడాది సంక్రాంతికి విడుదలైన మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అలవైకుంఠపురంలో సినిమాలు దాటాయి. అల వైకుంఠపురములో 40.83 లక్షల గ్రాస్‌తో, మహేష్ సరిలేరు 40.76 లక్షల రూపాయిలు కొల్లగొట్టింది. ఇప్పుడు జాతిరత్నాలు ఈ రెండు సినిమాతరవాత రూ.38.63 లక్షల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి బాహుబలిని వెనక్కి నెట్టింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jathi Ratnalu : జాతిరత్నాలు నుంచి మరో క్రేజీ సాంగ్.. సోషల్ మీడియాలో హల్ చల్