Producers Vs Theatre Owners: తెలంగాణ ఎగ్జిబిటర్స్‌కు కౌంటర్ ఇచ్చిన యక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్

Producers Vs Theatre Owners: చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓటీటీ రాజ్యమేలుతోంది. ఓటీటీలు కారణంగా రాబోయే రోజుల్లో సినిమా..

Producers Vs Theatre Owners: తెలంగాణ ఎగ్జిబిటర్స్‌కు కౌంటర్ ఇచ్చిన యక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్
Follow us

|

Updated on: Aug 23, 2021 | 3:19 PM

Producers Vs Theatre Owners: చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓటీటీ రాజ్యమేలుతోంది. ఓటీటీలు కారణంగా రాబోయే రోజుల్లో సినిమా థియేటర్స్ మూత పడే అవకాశాలు ఉన్నాయంటూ థియేటర్స్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలకు అడ్డుకట్ట వెయ్యకపోతే సినీపరిశ్రమకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని, థియేటర్స్‌ని నమ్ముకున్న జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20న సమావేశమైంది. ఈ సమావేశంలో కొందరు చేసిన విమర్శలపై ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఎగ్జిబిటర్లు మరియు థియేటర్ యజమానులు స్పందించిన తీరుతో తెలుగు సినిమా నిర్మాతలు తీవ్రంగా కలత చెందారు. ఈ సందర్భంగా వారు థియేటర్ యజమానులకు కౌంటర్‌ ఇచ్చారు. ఇక తెలుగు సినిమా నిర్మాతలు, థియేటర్‌ యజమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. అయితే సినిమా అనేది మొదలయ్యేది నిర్మాత వల్లనే, ఎక్కడ, ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎవరికి అమ్మాలో అది నిర్మాత ఇష్టం. బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదు. నిర్మాతలకు సహాయపడేలా విధంగా ఎగ్జిబిటర్స్ ఉండాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశాము. కానీ వారు పెద్ద సినిమాలకు, డిమాండ్ వున్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న సినిమా లపై వారు ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ లు అందరూ కలసి ఉంటేనే సిని పరిశ్రమ బాగుంటుంది. ప్రస్తుత సమస్యల పై అందరూ కలిసి చర్చించు కొని పరిష్కారాలు ఆలోచించుకోవాలి అని తెలిపింది ప్రొడ్యూసర్స్ గిల్డ్.

అలాగే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ లేకపోయినా వాళ్ళ సినిమాలు అడిన థియేటర్స్ ఇప్పటికీ ఉన్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అయితే థియేటర్స్‌లో సినిమా విడుదలైతే నిర్మాతల దగ్గర నుండి పోస్టర్స్ వేసే బాయ్స్, కూల్ డ్రింక్స్, సమోసాలు అమ్మే వర్కర్స్ వరకు ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. మూవీ థిమేటర్‌లో చూసిన అనుభూతి ఓటీటీలో ఉండదు. నిర్మాతలకు మా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీ సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుంది. తప్పని పరిస్థితుల్లో ఓటీటీల్లో విడుదల చేయాల్సి వస్తే, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత విడుదల చెయ్యండి అని థియేటర్స్ యజమానులు కోరారు.

Raksha Bandhan Celebrations: రాఖీ వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. నెట్టింట వైరల్‌గా మారిన చిత్రాలు.

DimpleHayathi: కొంటె చూపుతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. డింపుల్ సొగసులు పొగడతారామా..