Mamitha Baiju: నీ అభిమానం సల్లగుండా.. తెలుగు అభిమాని చేసిన పని చూసి కంగుతిన్న ప్రేమలు హీరోయిన్..
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ప్రేమలు సినిమా హీరోయిన్. తెలుగులో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇందులో రీను పాత్రలో చలాకీ అమ్మాయిగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది మమితా బైజు. ప్రేమలు సినిమా కంటే ముందు దాదాపు 15 చిత్రాల్లో నటించింది మమితా. కానీ ఈ సినిమాతోనే అటు సౌత్ ఇండస్ట్రీలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

మొన్నటివరకు కుర్రకారు ఫేవరేట్ క్రష్ అంటే త్రిప్తి డిమ్రి.. యానిమల్ సినిమాతో ఈ బ్యూటీకి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఈ అమ్మాడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్ లాగేసింది మరో కేరళ కుట్టి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుతుంది. తనే మమితా బైజు. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ప్రేమలు సినిమా హీరోయిన్. తెలుగులో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇందులో రీను పాత్రలో చలాకీ అమ్మాయిగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది మమితా బైజు. ప్రేమలు సినిమా కంటే ముందు దాదాపు 15 చిత్రాల్లో నటించింది మమితా. కానీ ఈ సినిమాతోనే అటు సౌత్ ఇండస్ట్రీలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమె నటనకు, క్యూట్ నెస్ కు ఇక తెలుగు కుర్రకారు అయితే ఫిదా అయిపోయారు.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. ఇక ఈ బ్యూటీ కూడా సాయి పల్లవిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రేమలు మూవీ ప్రమోషన్లలో చీరకట్టులో కనిపించి న్యాచురల్ బ్యూటీని గుర్తుచేసింది. తాజాగా ప్రేమలు సక్సెస్ మీట్ లో పాల్గొన్న మమితాకు ఓ తెలుగు అభిమాని ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో ఓ అభిమాని మమితా అంటే చాలా అభిమానం అని.. ఆమె చాలా నచ్చారని చెబుతూ స్టేజీ పైకి వచ్చి పళ్లెంలో హారతి ఇచ్చాడు. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అని చెబుతూ హారతి ఇచ్చాడు. దీంతో మమితాతోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
