Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sudha: అందరూ ఉన్న అనాథ నేను.. నటి సుధ తీవ్ర భావోద్వేగం.. వందల కోట్లు కోల్పోయి

సుమారు వెయ్యి సినిమాల్లో నటించిన సుధ కొన్ని వందల కోట్లు సంపాదించారు. కానీ ఆ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Actress Sudha: అందరూ ఉన్న అనాథ నేను.. నటి సుధ తీవ్ర భావోద్వేగం.. వందల కోట్లు కోల్పోయి
Actress Sudha
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2023 | 4:06 PM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎన్నో పాత్రల్లో ఆమె ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎందరో హీరోలుగా అమ్మగా నటించి.. అలరించింది. వందల సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకుంది. ఫస్ట్ కథానాయికగా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం మనగలవని.. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడంతో అలా సెటిల్ అయ్యారు. తమిళనాడు శ్రీరంగంలో మంచి స్థితిమంతులు కుటుంబంలో పుట్టారు సుధ. ఆమెది తమిళనాడు అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు.  అల్లు రామలింగయ్య సలహాతో తెలుగుపై శ్రద్ధ పెట్టి.. సొంతగా డబ్బింగ్ చెప్పేవారు. ఆ విధంగా ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. వరస సినిమాలు రావడంతో.. చాలా బిజీ అయిపోయారు సుధ. డబ్బు కూడా గట్టిగా సంపాదించారు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుగులు ఎదుర్కొంది.

ఢిల్లీలో హోటల్​ బిజినెస్​ చేయడం వల్ల ఆర్థికంగా చితికిపోయారు సుధ. ఆపై కొందరు నమ్మినవాళ్లు కూడా నిండా ముంచేశారు. భర్త కూడా ఆమెను వదిలేసి.. ఫారెన్ వెళ్లిపోయాడు. కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. అతనితో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. తనయుడు ఉన్నాడనే కానీ.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు సుధ.  చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్నాని… పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్​ సోకిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని.. తన తండ్రి కాలం చేసేవరకు తానే చూసుకున్నట్లు తెలిపారు.

జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు చెప్పారు సుధ. దేవుడు మనం ఏం చేయాలో ముందే నిర్ణయిస్తాడని చెప్పుకొచ్చారు. భవిష్యత్ గురించి కలత చెందడం మానేశానని వివరించారు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్లడమే అన్నింటికన్నా ఉత్తమమని ఆమె చెబుతున్నారు. ఉన్నదాంట్లో సంతృప్తి వెతుక్కుంటూ ముందుకు సాగడం తనకు బాగా అలవాటైందని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.