AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ande Sri Death: తెలుగు సినిమా సాహిత్యానికి అందె శ్రీ ‘సిరా’భిషేకం..

ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం ఉదయం లాలాగూడ ఇంట్లో అందెశ్రీ కుప్పకూలగా.. ఆయన్ను హూటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు.

Ande Sri Death: తెలుగు సినిమా సాహిత్యానికి అందె శ్రీ 'సిరా'భిషేకం..
Ande Sri Death
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2025 | 9:44 AM

Share

ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. అందెశ్రీ మరణ వార్త విని తెలంగాణ రాష్ట్రం మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగారం రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీతాన్ని రచించారు అందెశ్రీ. అలాగే తెలుగు సినిమా సాహిత్యంలో అందెశ్రీది ప్రత్యేక స్థానం. నటుడు డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి సినిమాల్లో హిట్ సాంగ్స్ రాశారు అందెశ్రీ 2006లో రిలీజ్ అయిన గంగ సినిమాకు ఉత్తమ గేయ రచయితగా నందీ అవార్డ్ అందుకున్నారు అందెశ్రీ.

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

నారాయణమూర్తి నటించిన ఎర్ర సముద్రం సినిమా కోసం రాసిన మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటను ఏపీలో విశ్వవిద్యాలయాల సిలబస్‌లో చేర్చారు. సినిమాల్లో అందెశ్రీకి తొలి అవకాశం ఇచ్చారు యలమంచి శేఖర్. అలాగే బతుకమ్మ సినిమాకు మాటలు కూడా రాశారు అందెశ్రీ. ప్రపంచంలోని మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాయాలని ప్రపంచమంతా తిరిగారు అందెశ్రీ.

దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే

అందె శ్రీ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పిపడిపోయారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో కన్నుమూశారని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా అందెశ్రీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అందెశ్రీది సిద్దిపేట్ (గతంలో వరంగల్ జిల్లా) రేబర్తి.

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.