Raghavendra Rao: రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు.. కారణం ఏంటంటే
హైదరాబాద్ లోని ఓ భూ వివాదం కారణంగా రాఘవేంద్ర రావు అలాగే కె. కృష్ణమోహన్‌లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పరిధిలోని షేక్ పేట్ రెండెకరాల భూకేటాయింపుపై కోర్టు నోటీసులు పంపింది. రాఘవేంద్రరావుకు ప్రభుత్వం షేక్ పేట్ లో రెండెకరాల భూమిని కేటాయించింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ లోని ఓ భూ వివాదం కారణంగా రాఘవేంద్ర రావు, అలాగే కె. కృష్ణమోహన్‌లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పరిధిలోని షేక్ పేట్ రెండెకరాల భూకేటాయింపు పై కోర్టు నోటీసులు పంపింది. రాఘవేంద్రరావుకు ప్రభుత్వం షేక్ పేట్ లో రెండెకరాల భూమిని కేటాయించింది. ఈ భూమి కేటాయింపును రద్దు చేయాలని బాలకిషన్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీ ధరతో భూమిని ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని నిబంధలు విరుద్ధంగా వాడుతున్నారని కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.
ఈ మేరకు మెదక్ జిల్లాకు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దాంతో తాజాగా హైకోర్టు రాఘవేంద్ర రావు,కె. కృష్ణమోహన్‌లకు నోటీసులు పంపింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో పబ్, థియేటర్ అంటూ ఇలా దుర్వినియోగం చేస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నాడు బాలకిషన్.
దాంతో విచారణ జరిపిన కోర్టు రాఘవేంద్ర రావుకు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
Glad to see you Radha after so many years.. And Congratulations for your daughter marriage. All the good luck pic.twitter.com/afE2xyuW5i
— Raghavendra Rao K (@Ragavendraraoba) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.