AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Encounter: వర్మకు షాకిచ్చిన హైకోర్టు.. ‘దిశ ఎన్‏కౌంటర్’ విడుదలకు బ్రేక్..

Disha Encounter Movie: ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన 'దిశ ఎన్‏కౌంటర్' సినిమా విడుదలకు హైకోర్టు కళ్లెం వేసింది.

Disha Encounter: వర్మకు షాకిచ్చిన హైకోర్టు.. 'దిశ ఎన్‏కౌంటర్' విడుదలకు బ్రేక్..
Disha Encounter
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 15, 2021 | 2:59 PM

Disha Encounter Movie: ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు హైకోర్టు కళ్లెం వేసింది. ఆ సినిమాను రెండు వారాల వరకు విడుదల చేయొద్దని చిత్రయూనిట్ ను ఆదేశించింది. సినిమా ప్రొడ్యూసర్ల పేర్లపై పిటిషన్ లో గందరగోళం ఉందని హైకోర్టు తెలిపింది. నిర్మాత రామ్ గోపాల్ వర్మ అని చెప్పిన పిటిషనర్… వర్మ కాదు అనురాగ్ అని కోర్టుకు తెలిపారు న్యాయవాది. అంతేకాకుండా.. దిశ సినిమా పేరును నిశా ఎన్ కౌంటర్ గా మార్చామని న్యాయవాది తెలిపారు.

2019లో హైదరాబాద్ శివారులో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన వర్మకు మొదట్లోనే షాకిచ్చింది సెన్సార్ బోర్డు. ‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా ట్రైలర్ విడుదలైన సమయంలో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టును కోరారు. ఆ తర్వాత ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ లభించింది.   సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా.. నట్టి క్రాంతి నట్టి కరుణ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

Vijay Sethupathi : కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు రూ. 25 లక్షలు అందజేత

Rhea Chakraborty: ‘నువ్వు లేకుండా జీవితం లేదు.. తలచిన ప్రతిసారీ గుండెకు భారమే’.. సుశాంత్ సింగ్ గురించి రియా భావోద్వేగ పోస్ట్..

Karthika Deepam: మోనిత రచ్చ చేస్తే ఏం చేస్తావని కొడుకుని ప్రశ్నించిన సౌందర్య.. తన నిజ స్వరూపం కార్తీక్ కు చూపించనున్న మోనిత