Karthika Deepam: మోనిత రచ్చ చేస్తే ఏం చేస్తావని కొడుకుని ప్రశ్నించిన సౌందర్య.. తన నిజ స్వరూపం కార్తీక్ కు చూపించనున్న మోనిత

Karthika Deepam: తెలుగు ప్రేక్షకులను కట్టుకుంటూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1066 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ చూద్దాం ..

Karthika Deepam: మోనిత రచ్చ చేస్తే ఏం చేస్తావని కొడుకుని ప్రశ్నించిన సౌందర్య.. తన నిజ స్వరూపం కార్తీక్ కు చూపించనున్న మోనిత
Karthikadeepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2021 | 1:05 PM

Karthika Deepam: తెలుగు ప్రేక్షకులను కట్టుకుంటూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1066 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ చూద్దాం .. దీపతో హిమ మాట్లాడుతూ.. అసలు ఏమైంది మీ ఇద్దరికీ అని ఆడుతుంటే.. శౌర్య వస్తుంది.. ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అమ్మ డాడీ మన దగ్గర ఎదో దాస్తున్నారు శౌర్య అంటుంది హిమ.. అందులో కొత్త ఏముంది అడిగితె కాలుష్యం అంటారు అని శౌర్య. అంటుంటే.. ఆడిపోయి ఫ్రెండ్స్ అయ్యారు.. మల్లి ఎదో కొత్త కాలుష్యం వచ్చింది అంటుంది హిమ. ఇదివరకూ నాన్న కోపడేవాడు.. కానీ ఇప్పుడు ఎదో తప్పు చేసినవాడిలా మౌనంగా ఉంటున్నాడు నాన్న అంటుంది శౌర్య. నాన్న నిజంగా వస్తాడా అని హిమ అడిగితే … ఎందుకు డౌట్ వచ్చింది.. అంటుంది శౌర్య .. రాత్రి మనదగ్గరే ఉంటాను అని చెప్పి.. ఇప్పుడు వెళ్లిపోయాడుగా అందుకే డౌట్ వచ్చింది అంటుంది హిమ.

సౌందర్య కు హిమ శౌర్య మాటలను గుర్తు తెచ్చుకుంటూ.. అసలు అక్కడ ఏమైంది.. కార్తీక్ పిల్లలని వదిలించుకుంటాడా అని ఆలోచిస్తుంటే శ్రావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో కార్తీక్ బట్టలు సర్దుకుని బ్యాగ్ తో వస్తాడు.. టిఫిన్ తినమంటే.. లేదు మా ఇంట్లో నేను మీ అక్క, పిల్లలు కలిసి టిఫిన్ చేస్తాం.. ఈ మాట వినడానికి ఎంత హాయిగా వినసొంపుగా ఉంది.. ఈ నిర్ణయం తీసుకోవడానికి నీకు పదేళ్లు పట్టింది. ఇంతకాలానికి జ్ఞానం కలిగిందిరా అంటాడు.. చాలా తప్పు చేశాను.. తప్పు చేశాను.. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా అంటుంటే.. మరి ఆ తప్పుని ఎలా సరిదిద్దకుంటావు.. నా బాధ నీ గురించి కాదు.. దీప , పిల్లల గురించి చిన్నప్పటి నుంచి కష్టాలు అన్నీ దానికే సొంతం.. కన్నీరు పేటెంట్ హక్కు దానికే రాసి ఉంది. రేపు పిల్లలు మోనిత కడుపుతో ఉండటం చూసి మోనిత ఆంటీ భర్త ఎవరు అని అడిగితే సమాధానం ఏం చెబుతావ్.అని ప్రశ్నిస్తుంది .. అంతవరకూ రానివ్వను మమ్మీ అని ధీమా వ్యక్తం చేస్తాడు కార్తీక్.. అమ్మానాన్న బాగానే ఉన్నారు అనుకునే సమయానికి మళ్ళీ ఇదిగో ఈ ప్రళయాన్ని సృష్టించావు\

పళ్లు రాలగొడతాను.. ఏమి మాట్లాడుతున్నావు రా నువ్వు.. మోనిత ఆటబొమ్మకడుగా ఆడపిల్ల… మోనిత పొగరబోతే కావొచ్చు.. పెళ్ళైన పరాయి మగాడి మీద మోజు పడి ఉండొచ్చు.. కానీ దాని దృష్టంతా నీ మీదేరా.. దాని ఆశ కోరిక, దాని కోరిక, గమ్యం అన్నీ నువ్వే రా.. అది నిన్ను తప్ప పరాయి మగాడ్ని ఆ దృష్టితో చూడాలేదని నాకు పదహారేళ్లుగా నాకు స్పష్టంగా తెలుసు. నువ్వే ప్రాణంగా బతికింది. అది ప్రమాదకారి, దాని మాటవినకురా చెప్పను.. అయినా వినలేదు.. ఇప్పుడు ప్రమాదంలో పడ్డావు.. అందరిని ప్రమాదంలో పడేశావు.. మోనిత ఊరుకుంటుందా రచ్చ రచ్చ చేస్తుంది నాకు ఏ సమాధానం చెబుతావు నిన్ను కలర్ పట్టుకుని నిలదీస్తుంది ఎం చేస్తావ్.. నన్ను ఏమి చేయమంటావు అని కోపంతో ప్రశ్నిస్తుంటే.. ఆపు మమ్మీ అంటుంటే ఇంతలో మోనిత ఫోన్ చేస్తుంది.

అది కట్ చేసి..మా ఇంటికి వెళ్ళొస్తా మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతాడు.. మోనిత నా గురించి తెలిసి కాల్ చేశాడు అంటే అర్ధం ఉంది.. నా గురించి తెలిసి కూడా కాల్ కట్ చేశాడు అంటే.. అంటూ కోపంతో ఊగిపోతూ.. ప్రియమణి ని పిలుస్తుంది. నేను పిలిచిన వెంటనే రావాలని తెలియదా అంటూ .. చీరని ఐరెన్ చేయమని ఆర్డర్ వేస్తుంది.

దీప పిల్లలు గుడి నుంచి ఇంటికి వచ్చే సరికి జనతా హాస్పటల్ అనే బోర్డు చూసి.. ఎవరు పెట్టారు అని అడుగుతుంది హిమ. డాడీ పెట్టించారా అంటుంటే.. కార్తీక్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. పిల్లలు సంతోషంగా కార్తీక్ దగ్గరకు వెళ్లి ఏమిటి నాన్న అది అని అడుగుతుంది. ఐతే నువ్వు ఇక్కడే ఉంటావా అంటే.. అందరికీ ఉచితంగా వైద్యం చేస్తాం అంటాడు. పెద్ద హాస్పటల్ అక్కడికి వెళ్ళారా.. అంటే అక్కడ ఇక్కడ వైద్యం చేస్తాను.. మరి బట్టలు తెచ్చావా డాడీ అంటుంది.. అందరం కలిసి ఇక్కడే ఉంటామా అంటే ఊ అంటాడు కార్తీక్. దీప లక్షణ్ ను రమ్మనమని చెప్పు.. చూసి.. అవసరమైన ఆపరేషన్ చేస్తాను అంటాడు.. ఇంతలో పిల్లలు చుట్టుపక్కల హెల్త్ ప్రాబ్లెమ్స్ చెబుతారు.. అన్నింటికీ ఒకే అంటాడు కార్తీక్.

నువ్వు ఎవరో తెలియనప్పుడే నాకు నవ్వు నచ్చవు.. అప్పుడు నీతో పాటు మోనిత కూడా వచ్చింది నాన్న అంటుంది శౌర్య.. రేపు.. నేను దీపని కాదు.. 10 ఎదురుచూడడనికి 10 రోజులు టైం ఇస్తున్నా.. మీ ఫ్యామిలీ వణికిపోయేలా చేస్తా బీ రెడీ అంటూ కార్తీక్ కి మోనిత వార్నింగ్ ఇచ్చింది.. కార్తీక్ యాక్షన్ ఏమిటి చూడాలి మరి

Also Read: గర్ట్‌ఫ్రెండ్‌ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ