Mirai: దుమ్మురేపిన తేజ సజ్జ మిరాయ్.. తొలి రోజే హనుమాన్ రికార్డ్ బ్రేక్
ఇటీవలే హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు తేజ సజ్జా. ఇప్పుడు మిరాయ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో మంచు మనోజ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రియ సైతం నటించారు. ఈ సినిమాలో వీరి ముగ్గురు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి.

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు తేజ సజ్జ. జంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు తేజ సజ్జ. హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రూ. 300కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా విడుదలైన మిరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే
మిరాయ్ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్ , ట్రైలర్ సినిమా పై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే శ్రియ కీలక పాత్రలో నటించింది. ఇక మిరాయ్ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..
తొలిరోజే మిరాయ్ సినిమా దేశవ్యాప్తంగా రూ.12 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా దాదాపు రూ. 10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది మిరాయ్ సినిమా. నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు ఇండియన్ రూపీస్ లో రూ. 6కోట్లు వసూల్ చేసింది. రానున్న రోజుల్లో మిరాయ్ సినిమా కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిరాయ్ సినిమా రూ. 60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమా హనుమాన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ను మిరాయ్ బీట్ చేసిందని తెలుస్తుంది.
ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..
#SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥
Experience ‘𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥’ in cinemas now 💥
North America by @ShlokaEnts @peoplecinemas
Superhero @tejasajja123 Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ
— People Media Factory (@peoplemediafcy) September 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








