- Telugu News Photo Gallery Cinema photos SriLeela's Advice Hugging for Happiness and Bollywood Success
Sreeleela: శ్రీలీల కు నీరసం వస్తే వెంటనే ఆ పని చేస్తుందట.. టాప్ సీక్రెట్ చెప్పిన ముద్దుగుమ్మ
స్క్రీన్ మీద క్యూట్‌గా కనిపించే భామలు వైరల్ సాంగ్స్ కి వేసే స్టెప్పులే కాదు.. ముద్దు ముద్దుగా చెప్పే మాటలు కూడా మెస్మరైజ్ చేస్తాయి. మామూలు టైమ్‌లోనే వాళ్లేం చెప్పినా వినాలనిపిస్తుంటుంది. అలాంటిది కూసింత మనసు బాగోలేకపోతే.. చెప్పింది చెప్పినట్టు చేసేయాలనిపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు అంటారా? శ్రీలీల కోసమే.. ఈ లేడీ ఏం చెప్పారు..? ఎవరికి చెప్పారు? డీటైల్స్ మాట్లాడుకుందాం వచ్చేయండి.
Updated on: Sep 13, 2025 | 12:49 PM

మీకు ఎప్పుడైనా నిస్సత్తువ ఆవహిస్తే ఏం చేస్తారు? అని ఎవరైనా శ్రీలీలను అడిగితే ఏం ఆన్సర్ వినిపిస్తుందో తెలుసా? నేరుగా ఇంటికెళ్లి... ఇంట్లో బాగా ఇష్టమైనవారిని గట్టిగా హగ్ చేసుకుంటారట.

ఈ విషయాన్ని ఆమెను ఎవరూ అడగలేదు. ఆమె అంతట ఆమే రివీల్ చేశారు. కాస్త నిరుత్సాహంగా ఉన్నాను. మనసేం బాలేదు అని శ్రీలీలతో చెప్పుకున్న ఓ అభిమానికి ఈ బ్యూటీ ఇచ్చిన సలహా అదేనట.

ఎదుటివారికి అది ఎంత వరకు యూజ్ అవుతుందో తెలియదుగానీ, తనకు మాత్రం అది చాలా చాలా ప్లస్ అవుతుందని ఓపెన్ అయ్యారు మిస్ లీల. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లోనే బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.

సక్సెస్ ఇచ్చిన చోటుని అంత తేలిగ్గా మర్చిపోవద్దనే సలహాలు అమ్మణికి బాగానే వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు బాగా తెలుసనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది శ్రీలీలలో.

ఎంత సూపర్ డూపర్ కేరక్టర్ చేసినా, పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్నా... లొకేషన్‌లో ఫ్లోర్ మీద ఓ మంచి స్టెప్ వేస్తే వచ్చే ఆనందం ఇక దేనిలోనూ ఉండదంటున్నారు ఈ లేడీ. నియర్ ఫ్యూచర్‌లో బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు మిస్ లీల.




