- Telugu News Photo Gallery Cinema photos Samantha's New Perspective Redefining Success and Finding Peace
Samantha: ఫ్రైడే వస్తుందంటేనే టెన్షన్.. టెన్షన్.. అసలు కారణం అదేనట
నాది నాది అనుకున్నది ఇవాళ నాదే కావచ్చు. కానీ రేపటిరోజున నాది కాకపోవచ్చు. నా స్థానంలో మరొకరు ఉండవచ్చు.. అంటూ మనసులోని మాటలకు ఫిల్టర్ వేయకుండా మాట్లాడేస్తున్నారు సమంత రూత్ ప్రభు. లైఫ్‌కి, సక్సెస్‌కీ సిసలైన మీనింగ్ తెలిసిందంటున్న ఈ లేడీ చాలా విషయాలే చెప్పుకొచ్చారు. శుక్రవారం వస్తోందంటే టెన్షన్.. టెన్షన్‌గా ఉండేదట సమంతకు.
Updated on: Sep 13, 2025 | 1:06 PM

శుక్రవారం వస్తోందంటే టెన్షన్.. టెన్షన్‌గా ఉండేదట సమంతకు. తన సినిమాలు రిలీజ్ అయ్యే రోజుల్లో మాత్రమే కాదు.. తన సినిమాల రిలీజ్‌లు లేని రోజుల్లోనూ ఒక రకమైన టెన్షన్ నిలవనిచ్చేది కాదట.

స్క్రీన్ మీదకు సినిమా రానప్పుడు టెన్షన్ ఎందుకు అని ఎవరైనా అడిగితే ఆన్సర్ బయటకు చెప్పేవారు కాదట సామ్. కొత్తగా వచ్చే హీరోయిన్ ఎవరైనా ఆ వారం క్లిక్ అయితే.. తన పరిస్థితి ఏంటి? రేసులో వాళ్లెక్కడుంటారు? తానెక్కడుంటాను? అనే థాట్ ప్రాసెస్ నిలవనిచ్చేది కాదట.

టాప్ టెన్‌లో తన పేరు ఉండటాన్నే సక్సెస్‌గా ఫీలయ్యారట సామ్. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ, నిత్యం బిజీగా ఉంటూ.. ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండాలని కోరుకునేవారట సామ్. కానీ ఇప్పుడు ఆ రోజుల్ని ఆలోచించుకుంటే ఒక రకంగా ఇబ్బందిగా ఉందని అంటున్నారు ఈ లేడీ.

నిజమైన సక్సెస్‌కి ఇప్పుడు అర్థం తెలిసిందంటున్నారు సమంత. ఒకప్పుడు నాది అనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఎవరో ఉంటున్నారు. రేపు ఇంకెవరో ఉంటారు.. అని చెబుతున్నారు ఈ బ్యూటీ. రెండేళ్లుగా పర్ఫెక్ట్ రిలీజ్ లేకపోయినా తననిప్పుడు ఏ టెన్షన్ దరిచేరడం లేదని చెబుతున్నారు.

మన గురించి, మనకేం కావాలన్న విషయం గురించి తెలుసుకున్నప్పుడు ఒకరకమైన నిశ్చింత వచ్చేస్తుందన్నది సామ్ చెప్పేమాట. ప్రయారిటీస్ తెలుసుకుని జీవితాన్ని ప్రశాంతంగా గడపడమే ఇప్పుడు తాను చేస్తున్న పని అని చెబుతున్నారు సామ్. ప్రస్తుతం ఆమె చేతిలో మల్టిపుల్ ప్రాజెక్టులున్నా.. రిలీజ్‌కి మాత్రం ఇంకాస్త టైమ్ పట్టే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి.




