- Telugu News Photo Gallery Cinema photos Know this Actress Who Bought Bike 21 Lakhs, Now Top Trending Heroine, Her Name Is Manju Warrier
Actress : అటు సినిమాల జోరు.. ఇటు 21 లక్షల బైక్ కొన్న హీరోయిన్.. అమ్మడు క్రేజ్ చూస్తే మతిపోద్ది..
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఆమె ఆస్తులు రూ.142 కోట్లు. అలాగే ఇటీవల ఆమె రూ.21 లక్ష విలువైన బైక్ కొనుగోలు చేసింది. ఆమె బైక్ రేసర్. ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Sep 12, 2025 | 9:57 PM

మంజు వారియర్.. మలయాళ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు పోషించి అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. నివేదికల ప్రకారం, మంజు వారియర్ ఆస్తుల విలువ దాదాపు రూ. 142 కోట్లు.

ఆమె సినిమాల నుంచి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలతో ఎక్కువగా సంపాదిస్తుంది. ఆమె పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. మంజు వారియర్ ఒక్కో చిత్రానికి రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు భారీ మొత్తాన్ని తీసుకుంటుంది.

ఆమె మలయాళ చిత్రాలలోనే కాకుండా, ధనుష్ సరసన 'అసురన్', అజిత్ కుమార్ సరసన 'తునైవు' వంటి తమిళ చిత్రాలలో కూడా నటించింది. ఆమెకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

నివేదికల ప్రకారం ఆమె ప్రతి ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ. 75 లక్షలు అందుకుంటుంది. మంజు వారియర్ కు బైక్ లు అంటే చాలా ఇష్టం. ఆమె వివిధ మోడళ్ల బైక్ లను సేకరించడానికి ఇష్టపడుతుంది. ఇటీవలే దాదాపు రూ. 21 లక్షల విలువైన BMW R 1250 GS ను కొనుగోలు చేసింది.

మంజు వారియర్ ఇప్పటికీ సినిమాల్లో విభిన్న పాత్రలకు ప్రాణం పోసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.




