లావుగా ఉండి.. మొహంపై మొటిమలు ఉంటే తప్పా.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

మనదగ్గర షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకొని హీరోయిన్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అలా వచ్చిన ఈ అమ్మడు మాత్రం ఏకంగా విజయ్ దేవరకొండ తోనే మొదటి సినిమా చేసింది.

లావుగా ఉండి.. మొహంపై మొటిమలు ఉంటే తప్పా.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్
Priyanka
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 7:20 AM

మనదగ్గర షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకొని హీరోయిన్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అలా వచ్చిన ఈ అమ్మడు మాత్రం ఏకంగా విజయ్ దేవరకొండ తోనే మొదటి సినిమా చేసింది. ఇంతకు ఆబ్యూటీ ఎవరనుకుంటున్నారా.. ప్రియాంక జవాల్కర్. తెలుగమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా ఉంది. మొదటి సినిమా టాక్సీవాలా తర్వాత ప్రియాంకకు ఆఫర్లు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ ఆఈ ముద్దుగుమ్మ కు అవకాశాలు పలకరించడం మానేశాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఎస్ ఆర్ కల్యాణ మండపం అనే సినిమా చేస్తుంది ఈ చిన్నది. దానితో పాటు సత్య దేవ్ నటిస్తున్న తిమ్మరుసు సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రియాంకకు తమిళ్ నుంచి కూడా పిలుపు వచ్చిందట. ఇటీవల ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

టాక్సీవాలా సినిమా తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పుకొచ్చింది ప్రియాంక. టాక్సీవాలా సినిమా తర్వాత బరువు పెరగడంతో పాటు మొహం మీద మొటిమలు కూడా వచ్చాయి దాంతో నేను డాక్టర్ ను సంప్రదించా..అప్పుడే నాకు థైరాడ్ తో పాటు హార్మోన్ ల సమస్యలు ఉన్నట్లుగా  తెలిసింది. ఇదిలా ఉంటే నేను కాలేజ్ లో చదువుకునే రోజుల్లో దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోకు వచ్చిన నెగటివ్ కామెంట్స్ కు నేను షాక్ అయ్యాను. ఒక అమ్మాయి కాస్త లావుగా ఉండి.. మొహంపై మొటిమలు కలిగి ఉంటే తప్పా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు అలా ఉన్న తాను సినిమాల్లోకి రావాలన్న కోరికతో బరువు తగ్గడంతో పాటు మొటిమలు లేకుండా చూసుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.

Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.