Taraka Ratna: తండ్రి ఇక తిరిగిరాడని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న తారకరత్న కూతురు..
23రోజులుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన తారకరత్న..కోలుకొని మృత్యుంజయుడిగా తిరిగొస్తాడని ఎదురుచూశారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి రాత్రి కన్నుమూశారు.

హైదరాబాద్ మోకిలలోని స్వగృహంలో తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు కుటుంబసభ్యులు. 23రోజులుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన తారకరత్న..కోలుకొని మృత్యుంజయుడిగా తిరిగొస్తాడని ఎదురుచూశారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి రాత్రి కన్నుమూశారు. బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు. తారకరత్న చూసి కుమార్తె వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేస్తోంది. తండ్రి ఇక తిరిగిరాడని తలుచుకొని ఆ చిన్నారి తల్లడిలిపోతోంది.
తారకరత్న భౌతికకాయాన్ని ఇవాళ మోకిలలోని ఆయన నివాసంలోనే ఉంచుతారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
నందమూరి మోహనకృష్ణ తనయుడు తారకరత్న.1983 జనవరి 8న జన్మించిన తారకరత్న.. 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెరంగేట్రం చేశారు. 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి..వరల్డ్ రికార్డు సృష్టించారు తారకరత్న. ఒకటో నంబర్ కుర్రాడు, యువరత్న సినిమాలు పెర్ఫామెన్స్ పరంగా తారకరత్నకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో లవర్‌బాయ్‌గా గుర్తింపు తీసుకొచ్చాయి.
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, రాజా చెయ్యివేస్తే, సారథిలాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు తారకరత్న. అమరావతి చిత్రంలో విలన్‌గా మెప్పించిన తారకరత్న..2009లో బెస్ట్ విలన్‌గా నందిఅవార్డు అందుకున్నారు. నిండైన కమిట్‌మెంటున్న కథానాయకుడతడు. సినిమాతో రెండు దశాబ్ధాల అనుబంధమున్న తారకరత్న..నాలుగు పదులైనా నిండకముందే ఇక సెలవంటూ వెళ్లిపోయారు.