Soundarya: సౌందర్య వర్దంతి.. చివరగా చెప్పిన మాటలు ఇవే.. మరణానికి ముందు రోజు..

అతి తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన సౌందర్య.. అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. 2004లో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సినీ పరిశ్రమకు తీరని లోటు. మరణించే సమయానికి సౌందర్య రెండు నెలల గర్భవతి. 17 ఏప్రిల్ 2004లో అనుకోని ప్రమాదంలో తన సోదరుడితోపాటు సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. సౌందర్య మరణించి నేటికి 20 సంవత్సరాలు. ఈ క్రమంలోనే సౌందర్యతో తమకున్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు.

Soundarya: సౌందర్య వర్దంతి.. చివరగా చెప్పిన మాటలు ఇవే.. మరణానికి ముందు రోజు..
Soundarya
Follow us

|

Updated on: Apr 17, 2024 | 4:39 PM

తెలుగు సినీ ప్రియుల మదిలో నిలిచిపోయిన అందమైన అపురూపం సౌందర్య. అద్భుతమైన నటనతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. డాక్టర్ కావాల్సిన అమ్మాయి.. నటిగా మారి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా కనిపించి అలరించింది. దశాబ్దకాలం పాటు వెండితెరపై సందడి చేసింది. అతి తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన సౌందర్య.. అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. 2004లో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సినీ పరిశ్రమకు తీరని లోటు. మరణించే సమయానికి సౌందర్య రెండు నెలల గర్భవతి. 17 ఏప్రిల్ 2004లో అనుకోని ప్రమాదంలో తన సోదరుడితోపాటు సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. సౌందర్య మరణించి నేటికి 20 సంవత్సరాలు. ఈ క్రమంలోనే సౌందర్యతో తమకున్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు.

సౌందర్యను చిత్రసీమకు పరిచయం చేసిన తమిళ్ డైరెక్టర్ ఆర్వీ ఉదయ్ కుమార్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరలవుతుంది. సౌందర్యలాంటి అద్భుతమైన నటిని మళ్లీ చూడడం చాలా అరుదు అని.. ఏ సినిమాకు ఒప్పుకున్నా నేను చేయగలనా అంటూ సందేహం వ్యక్తం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఏడాదికి దాదాపు 10 సినిమాల్లో సౌందర్య నటించేది అని.. రజినీకాంత్ నటించిన అరుణాచలం సినిమాకు ముందుగా కాల్షీట్ కూడా ఇవ్వలేకపోయిందని అన్నారు. మరణానికి రెండు రోజుల ముందు అంటే 2004 ఏప్రిల్ 15న తన భార్య సుజాతకు సౌందర్య కాల్ చేసిందని.. అప్పుడే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్పిందని అన్నారు. ప్రచారానికి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పిందని.. అన్నారు.

“ఆరోజు చాలా సమయంపాటు నాతో ఫోన్ మాట్లాడింది. ఆ తర్వాత అలసిపోయాను అంటూ ఫోన్ పెట్టేసింది. కాసేపటికే సత్యరాజ్ సర్ నా దగ్గరకు వచ్చి సౌందర్య మరణవార్త చెప్పాడు. ఆమె మరణం గురించి తెలియగానే క్షణంపాటు అలాగే నిలబడిపోయాను. సౌందర్య మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు” అని అన్నారు. ప్రస్తుతం ఉదయ్ కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles