AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Hanuman: మాటిస్తున్నా.. జీవితాంతం గుర్తుండిపోతుంది.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‏గా రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‏లోనే జై హనుమాన్ పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.

Jai Hanuman: మాటిస్తున్నా.. జీవితాంతం గుర్తుండిపోతుంది.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్..
Prashanth Varma
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2024 | 3:03 PM

Share

ఎలాంటి హడావిడి లేకుండా.. భారీ తారగణం కాకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‏గా రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‏లోనే జై హనుమాన్ పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. అంతేకాకుండా ఈ మూవీ ఆంజనేయ స్వామి పాత్రను కూడా రివీల్ చేయనున్నారు.

అలాగే సెకండ్ పార్టులో ఆంజనేయుడిగా మరో స్టార్ హీరో కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో హనుమాన్ పాత్రలో కనిపించే స్టార్ హీరో ఎవరంటూ సందేహాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు అడియన్స్. జై హనుమాన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ?.. కొత్తగా జాయిన్ అయ్యే నటీనటులు ఎవరెవరు అని ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈసినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రాముడికి హనుమంతుడు ప్రమాణం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్రేక్షకులకు మాటిస్తున్నట్లు తెలిపారు.

“ఈ పవిత్రమైన రోజు సందర్భంగా శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మాటిస్తున్నాను. మునుపెన్నడు లేని అనుభూతిని.. జీవితకాలం జరుపుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తానని.. ఈసారి మనందరికీ మరింత ప్రత్యేకం కానుంది” అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

మాటిస్తున్నా.. జీవితాంతం గుర్తుండిపోతుంది..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే