Agent Movie: ఏజెంట్ సినిమా నుంచి మరో అప్డేట్.. అఖిల్ సరసన మరో అందాల భామ..
అఖిల్ అక్కినేని.. ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరో.. ఇటీవల
అఖిల్ అక్కినేని.. ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరో.. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో చకచక తన తదుపరి చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. అందమైన ప్రేమకథగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ప్రకటించారు మేకర్స్.
ఇక ఈ సినిమాతోని మరో హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అఖిల్.. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఏజెంట్ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా.. కీలక పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే బుడాపెస్ట్‌లో నిర్వహించారు. ఇక తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు తమిళ కథనాయికగా అతుల్య రవిని తీసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ మేకోవర్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
Also Read: Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..