Vijay Thalapathy: ట్రెండ్ ఫాలో కాడు.. సెట్ చేస్తున్నాడు.. డైరెక్టర్గా మారనున్న ఆ స్టార్ హీరో తనయుడు..
హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్ కాస్త బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఓ స్టార్ తనయుడు. మొదటి సినిమాకు హీరోగా కాదు.. దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సాధారణంగా సినీ పరిశ్రమలో స్టార్ హీరోస్ వారసులు మళ్లీ హీరోలుగానే వెండితెరకు పరిచయమవుతుంటారు. క్రమంగా తమ నటనను మెరుగుపరుచుకుంటూ వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. పలు హిట్ చిత్రాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనంతరం.. ఇంట్రెస్ట్ బట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంటారు. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తుంటారు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో జరుగుతున్నది ఇదే. అయితే హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్ కాస్త బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఓ స్టార్ తనయుడు. మొదటి సినిమాకు హీరోగా కాదు.. దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రపరిశ్రమకు మరో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అతను ఎవరంటే..తమిళ్ స్టార్ విజయ్ దళపతి తనయుడు సంజయ్.
సంజయ్ గతంలో తన డాన్స్ తో అంరరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే తను వెండితెరకు పరిచయం కాబోతున్నాడని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు తను దర్శకుడిగా మారబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అతను దర్శకత్వానికి అవసరమైన పలు టెక్నికల్ కోర్సులను విదేశాల్లో అభ్యసిస్తున్నాడు.




ఇటీవల విజయ్ తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “విజయ్ తనయుడు సంజయ్ కు దర్శకత్వం పై ఆసక్తి ఎక్కువగా ఉంది. తను డైరెక్టర్ అయితే మొదట విజయ్ సేతుపతితో సినిమా రూపొందిస్తాడట. తర్వాత తన తండ్రితో సినిమా తెరకెక్కిస్తాడట. ఈ విషయాన్ని నాతో ఒకసారి చెప్పాడు. “అని అన్నారు. దీంతో సంజయ్ త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నారని తమిళ్ మీడయాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దళపతి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 14న విడుదల చేయనుండగా.. తమిళనాడులో జనవరి 11న విడుదల కాబోతుంది.