Jr NTR- Tamanna: మరోసారి కలిసి సందడి చేయనున్న తారక్ -తమన్నా.. ఎప్పుడంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాలిన అవసరం లేదు. తారక్ డైలాగ్‌లకు, డ్యాన్స్‌లకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాలిన అవసరం లేదు. తారక్ డైలాగ్‌లకు, డ్యాన్స్‌లకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాలతోనే కాదు ఇప్పుడు బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నాడు తారక్. వెండితెరపై హీరోగా ఇరగదీస్తున్న యంగ్ టైగర్.. బుల్లితెరపై హోస్ట్‌గా అదరగొడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఆ సీజన్ టాప్ టీఆర్పీతో దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రాంకు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ ప్రోగ్రాంకు ఫస్ట్ గెస్ట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యాడు. ఆతర్వాత దర్శకులు కొరటాల శివ-రాజమౌళి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ఈ గేమ్ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ హాజరుకానున్నారు. ఇక రీసెంట్‌గా సమంత కూడా ఈ గేమ్ షోలో పటిస్పీట్ చేసింది. సమంత ఎపిసోడ్‌ను ఈ నెల ఆఖరుని టెలికాస్ట్ చేయనున్నారు. అలాగే మహేష్, ప్రభాస్ ఎపిసోడ్స్‌ను దసరాకు, దీపావళికి ప్రసారం చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ గేమ్ షోకు ఇప్పుడు మరో హీరోయిన్ హాజరుకానుంది. ఆమె ఎవరోకాదు మిల్కీ బ్యూటీ తమన్నా తారక్ షోకు గెస్ట్ గా హాజరుకానుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే బుల్లితెర పై తమన్నా- తారక్ సందడి చేయనున్నారని టాక్. తారక్ తో కలిసి తమన్నా ఊసరవెల్లి సినిమాలో నటించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :