MAA Elections 2021: ఆ టాప్ దర్శకుడి విషయంలో మంచు విష్ణు ఫ్రాడ్ చేశారు .. సంచలన కామెంట్ చేసిన మెగా బ్రదర్

మా ఎన్నికలలో ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు

MAA Elections 2021: ఆ టాప్ దర్శకుడి విషయంలో మంచు విష్ణు ఫ్రాడ్ చేశారు .. సంచలన కామెంట్ చేసిన మెగా బ్రదర్
Nagababu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 11, 2021 | 4:23 AM

MAA Elections 2021: మా ఎన్నికలలో ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎవరి వ్యహారచన వారు చేసుకుంటూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొంటున్న రెండు ప్యానల్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారని ఇండస్ట్రీ జనాలే అనుకుంటున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ , కోట శ్రీనివాస్ రావు లాంటి లాపెద్దలను కలిసి తమ మద్దతు కావాలని కోరారు. ఇక ప్రకాష్ రాజ్ తనకు ఎలాంటిపెద్దల సపోర్ట్ అవసరం లేదు అంటూ.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ నాకే అంటూ మంచు విష్ణు చెప్తున్నా .. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తున్నారు.

దాదాపు 950 మంది సభ్యులున్న అసోసియేషన్‌లో ఈసారి ఓటింగ్ ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు డైరెక్ట్ మీడియా ముఖంగా తన మద్దతు ప్రకటించారు. ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఓటు వేయాలనేది నాగబాబు ఓ వీడియో రూపంలో తెలిపారు.. ప్రకాష్ రాజ్ కిందనుంచి పైకి వచ్చాడు. ఊరూరా తిరిగి నాటకాలు వేశారు. నటుల కష్టాలు ఆయనకు తెలుసు అన్నారు. కళ్ళ నిండా కలలు పెట్టుకుని తిరిగాడు కాబట్టి.. ఆయనకు సినిమా ఆర్టిస్టుల కష్టాలు తెలుసు. అనేక భాషల్లో నటిస్తున్నాడు కాబట్టి.. సినిమా ఆర్టిస్టులకు ఏంకావాలో తెలుసు.. ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు.. సంఘం విలువ తెలుసు.. అలాగే ఒక దేశ ప్రధానితో పోరాడటం తెలుసు. అలాగే మంచు విష్ణు గురించి మాట్లాడుతూ మోహన్ బాబుగారి అబ్బాయి. ఇండస్ట్రీలో పుట్టిన మనిషి, వాళ్ళ నాన్నగారు 500 సినిమాల్లో నటించారు. ఒక విద్య సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు.. అంతే అని అన్నారు నాగబాబు. ఇక ప్రకాష్ రాజ్ కు ప్రొడ్యూసర్స్ తో కాంట్రావర్సీలు ఉన్నాయని అంటున్నారు. మీరు కూడా సలీమ్ సినిమా సమయంలో వైవీఎస్ చౌదరి రెమ్యునరేషన్ సమయంలో మీరు ఫ్రాడ్ చేయలేదా.. ? అయన కోర్టు కెక్కిన సంగతి మర్చిపోయారా..?  కోర్టు మీకు మొట్టికాయలు వేసిందని తెలుగువాళ్ళకు తెలియదా..? అని నాగబాబు ప్రశ్నించారు. ఆయన పెద్ద దర్శకుడు కాబట్టి ఎదురునిలబడ్డాడు.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని నాగబాబు అన్నారు. ఇక ప్రజలు ప్రకాష్ రాజ్ ను తెలుగోడు అంటారు నిన్ను తెలుగు నేర్చుకో అంటారు.. అని సెటైర్లు వేశారు మెగా బ్రదర్.

.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే