AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CVL Narasimha Rao: సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా

CVL Narasimha Rao: ‘మా’ అధ్యక్ష పోటీకి నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్న నటుడు సీవీఎల్‌ నరసింహరావు శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు...

CVL Narasimha Rao: సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా
Subhash Goud
|

Updated on: Oct 09, 2021 | 7:07 AM

Share

CVL Narasimha Rao: ‘మా’ అధ్యక్ష పోటీకి నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్న నటుడు సీవీఎల్‌ నరసింహరావు శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి, బీజేపీ సినిమా సెల్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష రాయకముందే ఫెయిల్‌ అయ్యానని అన్నారు. దివంగత నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయని, తప్పకుండా ఈ ఎన్నికలు హాయిగా ముగుస్తాయని అన్నారు. ఒకవేళ అలా ముగియకపోతే నేను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా ఉండను. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు నేను దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను అని పేర్కొన్నారు. ఇలా ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీవీఎల్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించి, సీవీఎల్‌ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో, ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు మధ్యే పోటీ నెలకొంది. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెల్లడవుతాయి. మా సభ్యత్వానికి, బీజేపీ సినిమా సెల్‌కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.. బురదలో ఉన్నా వికసించడానికి నేను కమలాన్ని కాదు. పరీక్ష రాయకుండానే ఫెయిల్‌ అయ్యాను. ‘మా’ విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి, బీజేపీ విషయంలో నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి క్షమాపణలు చెబుతున్నా అని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

Samantha: చైతూకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా సమంత జాగ్రత్తపడ్డారా?

Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగంలో ఇబ్బందులు.. అధికంగా ఒత్తిళ్లు..!