AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: చైతూకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా సమంత జాగ్రత్తపడ్డారా?

చైతూతో డివోర్స్‌పై సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు సమంత. నా వ్యక్తిగత సమస్య మీద మీరందరూ చూపిన ఎమోషన్స్‌కి థ్యాంక్స్, నా మీద....

Samantha: చైతూకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా సమంత జాగ్రత్తపడ్డారా?
Sam Chay
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2021 | 7:05 PM

Share

చైతూతో డివోర్స్‌పై సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు సమంత. నా వ్యక్తిగత సమస్య మీద మీరందరూ చూపిన ఎమోషన్స్‌కి థ్యాంక్స్, నా మీద చూపిన జాలికి, దయకు కృతజ్ఞతలు అంటూ తన శ్రేయోభిలాషుల రుణం తీర్చుకున్నారు. తన మీద వచ్చిన వైల్డ్ రూమర్స్‌ నుంచి తనను కాపాడ్డానికి ప్రయత్నించిన వాళ్లందరినీ కూడా గుర్తు పెట్టుకుంటానన్నారు.

”నాకు ఎఫైర్స్ వున్నాయని, పిల్లల్నికనడం నాకిష్టం లేదని, నేను అవకాశవాదినని, నాకు అబార్షన్లు కూడా అయ్యాయని చాలా కథనాలు వచ్చాయి. విడిపోవడం అనేదే ఒక తీవ్రమైన బాధతో కూడినది.. అయినా.. ఈ సమయంలో కూడా నా వ్యక్తిత్వంపై జరుగుతున్న ఈ దాడి చాలా దారుణమైనది, కనికరం లేనిది..” అంటూ ఎమోషనల్ అయ్యారు సమంత.

కానీ… మీరందరూ అనుకునే విధంగా నేనెప్పుడూ చెయ్యను. ఇది నా ప్రామిస్.. ఈ కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి.. అంటూ ముక్తాయింపునిచ్చారు సమంత. ఈరోజు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య చీఫ్‌గెస్ట్‌గా పార్టిసిపేట్ చేయనున్నారు. ఆ వేదికపై చైతూ తన మారిటల్ లైఫ్‌పై స్పందించే అవకాశం వుంది. అందుకే.. ఈ విధంగా సమంత ముందుచూపుతో వ్యవహరించి… తన వెర్షన్‌ని రివీల్ చేశారు.

కానీ.. విడాకుల తర్వాత తన ఆవేదనను చెప్పారే తప్ప… విడాకులకు ముందు ఏం జరిగింది.. చైతూతో అసలెందుకు పొసగలేదు.. ఏ విషయం దగ్గర డిఫరెన్సెస్ వచ్చాయి అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు సమంత. అవన్నీ టూ పర్సనల్స్ కనుక.. వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అటు.. ఇవాళ సాయంత్రం… తమ్ముడి ప్రిరిలీజ్ ఈవెంట్‌లో చైతూ, బిగ్‌బాస్‌ షోలో నాగార్జున, సోషల్ మీడియాలో ఫ్యాషన్‌ బ్రాండ్ షోలో సమంత… ఇలా ఎవరి దారిలో వాళ్లు బిజీగా వుండబోతున్నారు.

-శ్రీహరి రాజా, ఈటీ డెస్క్, టీవీ9 తెలుగు