అందుకే తమన్నా రెట్టింపు ధర చెల్లించింది

మిల్కీ బ్యూటీ తమన్నా.. పరిచయం అక్కరలేని అందాల రాశి. దక్షిణాది భాషల్లో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించిన దాంతో ఫ్యూచర్ ‌ప్లాన్ చేసుకుంటోంది ఈ భామ. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారిన తమన్నా సొంతంగా బిజినెస్‌లు చేస్తూ లాభాలను కూడా ఆర్జిస్తోందట. అయితే ఆమె ఎక్కవగా స్థిరాస్తులు కొనేందుకే ఇష్టపడుతోందట. ఇక ముంబై వెస్ట్‌లో ఉన్న వెర్సోవా […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:10 pm, Tue, 25 June 19
అందుకే  తమన్నా రెట్టింపు ధర చెల్లించింది

మిల్కీ బ్యూటీ తమన్నా.. పరిచయం అక్కరలేని అందాల రాశి. దక్షిణాది భాషల్లో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించిన దాంతో ఫ్యూచర్ ‌ప్లాన్ చేసుకుంటోంది ఈ భామ. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారిన తమన్నా సొంతంగా బిజినెస్‌లు చేస్తూ లాభాలను కూడా ఆర్జిస్తోందట. అయితే ఆమె ఎక్కవగా స్థిరాస్తులు కొనేందుకే ఇష్టపడుతోందట.

ఇక ముంబై వెస్ట్‌లో ఉన్న వెర్సోవా ఏరియాలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలుచేసింది తమన్నా. దాన్ని మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయకుండా డబుల్ రేటుకు కొనేసింది. ఎందుకంటే తను కొన్న ఫ్లాట్ నుంచి చూస్తే ముంబై సముద్రం వ్యూ అందంగా కనిపిస్తుందట. అందుచేత ఇంత అందమైన ఫ్లాట్‌కి ఎంతిచ్చినా తక్కువే అనుకుని డిసైడై ఇలా రెట్టింపు ధర చెల్లించినట్టుగా తెలుస్తోంది. బేవ్యూ పేరుతో అందంగా డిజైన్ చేసిన ఈ అపార్ట్‌మెంట్‌ మొత్తం 22 అంతస్తులతో ఉంది. ఇందులో 14వ అంతస్తులో తమన్నాతన ఫ్లాట్‌ను సొంతం చేసుకుంది. మామూలుగా వెర్సోవా ఏరియాలో ఒక్కో చదరపు గజం రూ. 35,000 నుంచి రూ.40,000 ధరలో ఉండగా తమన్నా మాత్రం ఆ ధరను రెట్టింపు చేసి ఒక్కో స్క్వేర్ ఫీట్ కోసం రూ.80,778 చెల్లించినట్టుగా చెబుతున్నారు. మొత్తం 2,005 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యం కలిగిన ఈ ఫ్లాట్ కోసం తమన్నా రూ.16.60 కోట్లు ఖర్చు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ధరను భాగా పెంచేసి కొనుక్కున్న ఈ ఫ్లాట్‌లో ఇంటీయర్ కోసం అదనంగా మరో రూ.2 కోట్లు కూడా ఖర్చు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ ఫ్లాట్‌ను బిల్డర్ సమీర్ బోజ్వానీ నుంచి కొనుగోలు చేసి గత నెలలోనే అగ్రిమెంట్‌మీద సంతకాలు చేయడం కూడా పూర్తయిందట. ఇక రిజిస్ట్రేషన్ పత్రాలపై తమన్నా భాటియాతో పాటు ఆమె తల్లి రజనీ భాటియా పేర్లు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే ఇప్పటివరకు ముంబై లోఖండ్‌వాలాలో ఉంటున్న ఈ మిల్కీ బ్యూటీ త్వరలోనే ఈ బేవ్యూకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తానికి సినిమాల్లో ఫుల్ బిజీ హీరోయిన్‌గా ఎదిగి ముంబైలో అందమైన ఇంటిని సొంతం చేసుకోవడం ఒక ఎత్తయితే.. దానికి రెట్టింపు ధర చెల్లించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తమన్నా రాజుగారి గది 3 మూవీ చేస్తోంది.