నీకు నువ్వే.. నాకు నేనే అంటున్న ఆ ఇద్దరు..

దిశా పటానీ.. నార్త్ ‌ ఇండియన్ మోడలింగ్ భామ గుర్తుందా? కొణిదెల వారి హీరో వరుణ్ తేజ్ పక్కన లోఫర్ మూవీలో నటించింది. ఈ మూవీకి పూరీ జగన్నాధ్ డైరెక్టర్. అందులో ఈ బ్యూటీ చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఈ మూవీ రిలీజై నాలుగేళ్లు దాటింది.ఆతర్వాత దిశా పటానీ చాల చూసింది చాల చేసింది కూడా. ఎంఎస్ ధోనీ, భాగీ సీక్వెల్, సల్మాన్ ఖాన్ భారత్ మూవీల్లో మెరిసింది. ఇదంతా ఆమె రీల్ కెరీర్ గురించి. […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:10 pm, Tue, 25 June 19
నీకు నువ్వే.. నాకు నేనే అంటున్న ఆ ఇద్దరు..

దిశా పటానీ.. నార్త్ ‌ ఇండియన్ మోడలింగ్ భామ గుర్తుందా? కొణిదెల వారి హీరో వరుణ్ తేజ్ పక్కన లోఫర్ మూవీలో నటించింది. ఈ మూవీకి పూరీ జగన్నాధ్ డైరెక్టర్. అందులో ఈ బ్యూటీ చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఈ మూవీ రిలీజై నాలుగేళ్లు దాటింది.ఆతర్వాత దిశా పటానీ చాల చూసింది చాల చేసింది కూడా. ఎంఎస్ ధోనీ, భాగీ సీక్వెల్, సల్మాన్ ఖాన్ భారత్ మూవీల్లో మెరిసింది. ఇదంతా ఆమె రీల్ కెరీర్ గురించి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పొడుగుకాళ్ల సుందరి రియల్ లైఫ్‌లో రొమాన్స్ కూడా కంటిన్యూ చేసింది. భాగీ 2లో హీరోగా చేసిన టైగర్ ష్రాఫ్‌తో కెమిస్ట్రీ పండించింది.

ఒకప్పటి హీరో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్..వంపులు తిరిగిన కండలతో కనిపించే హీరో. ఈ ఫిజిక్ కోసం బాగా వర్కవుట్స్ చేసి బాలీవుడ్ రాంబోగా పేరుతెచ్చుకున్నాడు. టైగర్‌తో కలిసి దాదాపు రెండేళ్లనుంచి డేటింగ్‌లో ఉంది దిశా. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. లివిన్ రిలేషన్‌ఫిప్ కొనసాగించడం బాలీవుడ్ మొత్తానికి తెలిసిన విషయమే. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని కలరింగ్ ఇచ్చుకుంటూ కంటిన్యూ చేసేయడం వీరికి అలవాటైపోయింది.

అయితే ఇంత అన్యోన్యంగా సాగిపోతున్న వీరి స్నేహం బెడిసికొట్టినట్టుగా వార్తలొస్తున్నాయి. దీనికి బలాన్నిచ్చేలా మేమిద్దరం ఎవరికివారే అంటూ వేర్వేరుగానే స్టేట్‌మెంట్స్ ఇచ్చేసుకున్నారు. అయితే ఇంతకాలం ఎంతోదగ్గరగా గడిపిన వీరు సడెన్‌గా దూరం కావడానికి రీజన్ ఏమై ఉంటుందా అని బాలీవుడ్ జనాలు తీవ్రంగా ఆలోచించేసరికి వారికి ఒక విషయం తెలిసిందట.. అదేంటంటే టైగర్ ష్రాఫ్ తనను కాదని మరికొంతమంది అమ్మాయిలతో తిరగుతున్నాడని దిశాకు అనుమానం కలిగిందట. ఇదిలా ఉంటే ఈ అమ్మడు కూడా ఖాళీగా ఉండలేక మహరాష్ట్రాలో యంగ్ పొలిటీషిన్‌గా ఎదుగుతున్న ఆదిత్య ఠాక్రేకు దగ్గరవుతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదైతేనేం.. ఇంతకాలం ఒకరికి ఒకరుగా కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన వీరిద్దరూ ప్రస్తుతానికి ఎవరి దారి వారు చూసుకున్నారన్నమాట.