Suriya: ఈసారి సూర్య వంతు.. రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.. ఎప్పుడంటే
ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు రీరిలీజ్ అయి భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ రీరిలీజ్ ల హంగామా ఇంకా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలు రీ రిలీజ్ అయ్యి సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల రీ రిలీజ్ హంగామా తెగ కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి కలెక్షన్స్ రాబడుతున్నారు. ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు రీరిలీజ్ అయి భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ రీరిలీజ్ ల హంగామా ఇంకా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలు రీ రిలీజ్ అయ్యి సందడి చేసిన విషయం తెలిసిందే. హీరోల పుట్టిన రోజులకు.. ప్రత్యేక సందర్భాలకు సినిమాలను రీ రిలీజ్ చేయండి చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా కూడా రీరిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సూపర హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
తమిళ్ హీరో సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే..ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను అనుకుంటూ ఉంటాయి. సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఇప్పుడు రీరిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించి అలరించారు. ఈ మూవీలో సూర్య నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే ఈ మూవీలో సమీరా రెడ్డి, రమ్య, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. సూర్య పుట్టిన రోజు జూలై 23 సందర్భంగా.. సినిమాను జూలై 21న 4కే వెర్షన్ లో రీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది.