Spy : రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన నిఖిల్ సినిమా.. బుకింగ్స్‌లో అదరగొట్టిన స్పై
ఇందుకు ఉదాహరణగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యి సత్తా చాటాయి. ఇక ఇప్పుడు యంగ్ హీరో సూర్య కూడా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న హీరో పెద్ద హీరో.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ బాగుంటే చాలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు హిట్ అందుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యి సత్తా చాటాయి. ఇక ఇప్పుడు యంగ్ హీరో సూర్య కూడా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. స్వామిరారా సినిమాతో మొదలు పెట్టి రీసెంట్ గా వచ్చిన 18 పేజెస్ వరకు మంచి హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు స్పై అనే సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.
స్పై విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న మూవీ. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కె.రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమాకు గ్యారీ బి హెచ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు నిఖిల్. ఈ మూవీ బుకింగ్ ఓపెన్ అయిన 9 నిమిషంలోనే క్లోజ్ అయ్యాయి . కేవలం 9 నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్ అవ్వడంతో స్పై మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. జూన్ 29 ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.